అఫీషియల్ అనౌన్స్మెంట్.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఉస్తాద్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, మరొకవైపు సినిమాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.;

Update: 2026-04-11 07:10 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు, మరొకవైపు సినిమాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే రాజకీయంగా ప్రజలకు అండగా నిలుస్తూ దూసుకుపోతున్న ఈయన.. ఇటు సినిమాలు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనుకున్న రేంజిలో ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా రికార్డు చేయడం అనే విషయాన్ని పక్కన పెడితే కనీసం నిర్మాతలకు లాభాలను కూడా అందివ్వడం లేదు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి..



 


ఇకపోతే గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నారు.. పైగా బండ్ల గణేష్ కి భారీ లాభాలు లభించడమే కాకుండా ఇటు పవన్ కళ్యాణ్ కు అటు శృతిహాసన్ కి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. అంతేకాదు వీరి కెరీర్ కు పునాది కూడా వేసింది.

ఇక దీంతో మళ్లీ హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా అనగానే గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అందులో భాగంగానే ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ ప్రేక్షకుల ముందుకు మార్చి 19వ తేదీన వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కథ పేలవంగా అనిపించడమే కాకుండా అదే సమయంలో ధురంధర్ సినిమా కూడా విడుదలవడంతో తెలుగు సినిమా కంటే కూడా డబ్బింగ్ సినిమాకే ఆదరణ పెరిగింది. అలా ఉస్తాద్ కి ఆ సమయం కలిసి రాలేదు. కంటెంట్ ను కూడా ప్రేక్షకులు మెచ్చకపోవడంతో మొత్తానికి ఈ సినిమాకు రూ.80 కోట్ల వరకు నష్టం వచ్చిందని సమాచారం.

మరోవైపు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే అప్పుడు ఇప్పుడు అంటూ వార్తలు రాగా నేడు తాజాగా ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఏప్రిల్ 16వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ్ మలయాళం, కన్నడ , హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ బ్యాక్ ఫోటో ని షేర్ చేస్తూ.. పేరు భగత్..కానీ ఉద్యమం ఇతని గుర్తింపు అంటూ క్యాప్షన్ కూడా జోడించింది.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీ లీల , రాశి ఖన్నా హీరోయిన్ లుగా నటించారు. కేఎస్ రవికుమార్, గౌతమి, రావు రమేష్ , శ్రీనాథ్ మాగంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ బాణీలు సమకూర్చగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Tags:    

Similar News