ద‌టీజ్ చిరు.. ప‌బ్లిసిటీలో ఆయ‌న‌ రూటే స‌ప‌రేటు

Update: 2020-12-23 16:30 GMT
ఏదైనా సినిమాని తెర‌కెక్కించ‌డం ఎంత ముఖ్య‌మో మంచి ప‌బ్లిసిటీతో రిలీజ్ చేయ‌డం ఈరోజుల్లో అంతే ముఖ్యం. ఎంత‌టి క్రేజీ హీరో అయినా ప్ర‌చారంలో తేడాలొస్తే అంతే సంగ‌తి. ఆ మూవీ జ‌నంలోకి పూర్తిగా వెళ్ల‌దు. ఇక బాహుబ‌లి .. సాహో చిత్రాల‌తో ఉత్త‌రాదిన మారుమూల గ్రామాల‌కు ప్ర‌భాస్ తెలిసారంటే ఆ స్థాయి ప్ర‌చారం వ‌ల్ల‌నే. ఆ రీచ్ కేవ‌లం ప్ర‌చారంలో తెలివైన ఎత్తుగ‌డ‌ వ‌ల్ల‌నే సాధ్య‌మైంది.

ఇక ఇలాంటి విష‌యాల్లో మెగాస్టార్ చిరంజీవి త‌క్కువేమీ కాదు. ఆయ‌న స్థాయికి సినిమాకి ప‌బ్లిసిటీ అవ‌స‌ర‌మా? అనుకుంటే పొర‌పాటే. స్టార్ డ‌మ్ ఎంత ఉన్నా ప్ర‌చారం చాలా చాలా అవ‌స‌రం అని చిరు అంగీక‌రిస్తారు. తాను ఆచ‌రించి చూపిస్తారు. నామోషీకి పోరు. ఇంత‌కుముందు సైరా ప్ర‌మోష‌న్స్ కోసం టాలీవుడ్ త‌ర‌హాలోనే బాలీవుడ్ మీడియాలోనూ ఆయ‌న అగ్రెస్సివ్ గా ప్ర‌చారంలో పాల్గొన్నారు. అక్క‌డ ఆయ‌న ఏ వేదిక‌కు వెళ్లినా సెల్యూట్ కొట్టిన‌వాళ్లే క‌నిపించారు.

మొన్న‌టికి మొన్న బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫైన‌ల్ వేదిక‌పైనే ఆచార్య‌కు తెలివైన ప్ర‌చారం చేసుకున్నారు ఆయ‌న‌. నా ఆచార్య‌కు అప్పుడే ప్ర‌మోష‌న్ వ‌చ్చేస్తోంది! అంటూ జోక్ చేస్తూనే కావాల్సిన ప‌బ్లిసిటీని కొట్టేశారు.

చాలా గ్యాప్ త‌ర్వాత `ఖైదీ నెం 150`తో రీఎంట్రీ ఇచ్చిన‌పుడు చిరు అంతే ఎగ్రెస్సివ్ గా ప్ర‌చార‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వ‌య‌సు 60 పైబ‌డినా ఆయ‌న తీరిగ్గా కూచునేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఒక డెబ్యూ  హీరోలా రీఎంట్రీ ఇచ్చి 20 ప్ల‌స్ కుర్రాడిలా `సైరా - న‌ర‌సింహారెడ్డి` లాంటి భారీ చిత్రంలో న‌టించారు. ప్ర‌స్తుతం కొర‌టాల తో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం చిరు లుక్ మార్చిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. మునుప‌టి కంటే ఎన‌ర్జిటిక్ గా న‌వ‌యుకుడిలా క‌నిపిస్తూ స్పాంటేనియ‌స్ హ్యూమ‌ర్ తో మెరుపులు మెరిపిస్తున్నారు చిరు. ప్ర‌స్తుతం వ‌రుస‌గా పెద్ద క్యూ ఉంది. లూసీఫ‌ర్ రీమేక్ స‌హా ప‌లు రీమేక్ క‌థల్లో న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. ఇక వీట‌న్నిటికీ గంప‌గుత్త‌గా ప్ర‌చారం సాగిపోతోంది అంటే అది మెగాస్టార్ యాక్టివిటీస్ వ‌ల్ల‌నే.

ఇటీవ‌ల బిగ్ బాస్ 4.. సామ్ జామ్ వంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న చిరు న‌వ‌యువ‌కుడినే త‌ల‌పిస్తూ ఎంతో ఎన‌ర్జిటిక్ గా క‌నిపించారు. ఇలా ప్ర‌తిచోటా త‌న‌ని తాను లైమ్ లైట్ లో ఉంచుకుంటూనే త‌న సినిమాల‌కు కావాల్సిన ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇవేగాక డిజిట‌ల్ మీడియా సోష‌ల్ మీడియాల్లోనూ బిగ్ బి అమితాబ్ త‌ర్వాత అంత‌టివాడిగా స్పీడ్ చూపిస్తున్నారు చిరంజీవి. ప్ర‌తి విష‌యాన్ని అభిమానుల‌కు ఎంతో చేరువ‌గా తీసుకెళుతున్నారు. ఇదంతా ఒక స్టార్ కి కావాల్సిన మినిమం అర్హ‌త‌లు అని అన్న‌య్య చెప్ప‌క‌నే చెబుతున్నారు. నేటిత‌రం న‌టీన‌టులు ఆయ‌న నుంచి నేర్వాల్సిన విష‌యాలు ఇవ‌న్నీ.
Tags:    

Similar News