సూపర్ స్టార్ కి తప్పని హీరోయిన్ కష్టాలు...!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 'బ్లాక్ బస్టర్ కా బాప్' అనిపించుకున్నాడు. ఇదే ఊపులో మహేష్ తన నెక్స్ట్ సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. మహేష్ తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న సినిమాకి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం చేయబోతున్నట్లు సమాచారం. కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న మహేష్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా కొంత డిఫరెంట్ గా ఉండేలా కొత్త తరహా కథలను ఎంచుకుంటున్నాడు. మహేష్ బాబు సినిమాల విషయంలో ఎంత సెలక్టివ్‌గా ఉంటాడో.. హీరోయిన్ల విషయంలో కూడా అంతే కేర్ తీసుకుంటాడు. మహేష్ తన కెరీర్‌లో కేవలం ఇద్దరు హీరోయిన్లను మాత్రమే రిపీట్ చేశాడు. వారిలో త్రిషతో రెండోసారి తీసిన ‘సైనికుడు’.. సమంతతో తీసిన మూడో సినిమా ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్లుగా నిలవడంతో మహేష్‌కు ప్రతీ సినిమాలో హీరోయిన్‌ను మార్చాలనే సెంటిమెంట్ పట్టుకుంది. తన నెక్స్ట్ సినిమా ద్వారా ఓ బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడని టాక్.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఆలీఖాన్ ని మహేష్ పక్కన హీరోయిన్ గా అనుకుంటున్నారట. సారా వయసు 24 ఏళ్లు. దాంతో మహేష్ పక్కన సారా మరీ చిన్నపిల్లలా కనిపిస్తుందేమోనని డౌట్ పడుతున్నారు ఫ్యాన్స్. మహేష్ బాబుకి 44 ఏళ్లైనా చూడడానికి చాలా యంగ్ గా కనిపిస్తాడు. అంత వయసున్నా లుక్స్ పరంగా మహేష్‌కు తిరుగులేదు. ఎంత యంగ్‌గా కనిపించినా తనకంటే 20 ఏళ్లు చిన్నదైన సారాను హీరోయిన్‌గా పెట్టుకోవడమంటే పెద్ద రిస్క్ చేయడమే అంటున్నారు ఫ్యాన్స్. అందులోనూ పరుశురామ్‌తో చేస్తున్న సినిమా ఓ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది.. అలాంటి కథలో చిన్నపిల్లలా కనిపించే హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తే విపరీతమైన ట్రోల్స్ రావడం గ్యారెంటీ. తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ చాలామంది స్టార్లు ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజానికి సారా హిందీలో రణవీర్ సింగ్ పక్కన నటించింది. వారిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉన్నా సారా రణవీర్ పక్కన సెట్ అయింది. సో మహేష్ పక్కన సారా సెట్ అవుద్దని చెప్పవచ్చు.
అంతేకాకుండా మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీకి నమ్రత, సొనాలీ బింద్రే, లీసా రాయ్, అమృతరావు, బిపాసా బసు లాంటి బాలీవుడ్ హీరోయిన్లను పరిచయం చేశాడు. వీరిలో ఒక్క సొనాలీ బింద్రే తప్ప మిగిలిన బాలీవుడ్ హీరోయిన్లు సూపర్ స్టార్ కి హిట్ ఇవ్వలేకపోయారు. మరోసారి మహేష్ కోసం బాలీవుడ్ హీరోయిన్ వైపు చూడడంతో ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందేమోనని భయపడుతున్నారు మహేష్ ఫ్యాన్స్. వాస్తవానికి మహేష్ ప్రతి సినిమాకి హీరోయిన్ విషయంలో సమస్య ఎదురవుతూనే ఉంది. మహేష్ ఛార్మింగ్ కి పక్కన ఎలాంటి హీరోయిన్ ని పెట్టినా అతని పక్కన చిన్నబోతుంటారు. మరి ఈ సినిమాలో ఏ బ్యూటీని సెట్ చేస్తారో చూడాలి.