ఎన్టీఆర్ లో నో బాలయ్య - ఫిక్స్

Update: 2019-01-04 05:32 GMT
అదేంటి సినిమా మొత్తం బాలకృష్ణ ఉంటే ఎన్టీఆర్ లో నో బాలయ్య అంటారేమిటి అని ఆశ్చర్యపోకండి. ఇక్కడ అన్నది మనిషిని గురించి కాదు పాత్ర గురించి. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవితాన్ని తెరమీద చూపించే ప్రయత్నంతో దర్శకుడు క్రిష్ తో బాలయ్య చేసిన నటనానవిష్కారం ఈ నెల 9 నుంచి సందడి చేయనుంది. ఇందులో ఎవరెవరు ఏ పాత్రలు చేస్తున్నారు అనే క్లారిటీ ఇప్పటికే వీడియో రూపంలో టీం అధికారికంగా విడుదల చేసింది. దాదాపు అందరూ ఉన్నారు కాని ఎన్టీఆర్ నట వారసుడిగా ఒక్క బాలయ్య పాత్ర ఎవరు చేసారు అనే క్లూ మాత్రం అందులో ఇవ్వలేదు.

దానిక్ కళ్యాణ్ రామ్ అధికారికంగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసాడు. తారక్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అవసరం లేదు కాబట్టే బాలయ్య బాబాయ్ పాత్ర కూడా ఎన్టీఆర్ లో ఉండదని తేల్చి చెప్పేసాడు. సో బాలకృష్ణ ప్రస్తావన వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. నిజానికి ఎక్కడా రెండు భాగాలలో బాలయ్య పాత్ర రాదంటే ఆశ్చర్యమే. ఏదో ఒక సీన్ లో సందర్భంలో ఖచ్చితంగా కనిపించాల్సిన అవసరం కథానుసారంగా ఉంది. మరి క్రిష్ ఏం మేజిక్ చేసి ఆ లోటు లేకుండా చేసాడో సినిమా చూసాక కాని అర్థం కాదు.

ఎన్టీఆర్ తన సినిమా రంగపు వారసుడిగా దగ్గరుండి మరీబాలయ్యకు కెరీర్ ప్రారంభంలో మార్గనిర్దేశనం చేసారు. తాతమ్మ కల మొదలుకుని ఐదారేళ్ళ పాటు నాన్న అడుగుజాడల్లోనే నడిచాడు బాలయ్య. మంగమ్మ గారి మనడు నుంచి తన స్వంత పంధాలోకి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు కనీసం చూచాయగా బాలకృష్ణ పాత్రను ఎన్టీఆర్ లో చూపించాల్సి ఉంటుంది. కళ్యాణ్ రామ్ చేస్తున్న హరికృష్ణ పాత్ర ఎలాగూ మహానాయకుడులో కీలకంగా మారుతుంది. మరి బాలయ్యది లేదు అంటే కొంత లోటే అని చెప్పొచ్చు




Full View
Tags:    

Similar News