'అఆ' టైంలో గురూజీతోనూ వాదించా : నితిన్‌

Update: 2020-02-20 06:15 GMT
నితిన్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని ‘భీష్మ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించింది. సినిమాకు పాజిటివ్‌ బజ్‌ ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాకు మరింత పబ్లిసిటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సినిమా ప్రమోషన్‌ కార్యక్రమం లో నితిన్‌ మాట్లాడుతూ దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తన కెరీర్‌ కు త్రివిక్రమ్‌ గురూజీ అంటూ చెప్పుకొచ్చిన నితిన్‌ కొన్ని సందర్బాల్లో ఆయన తో వాదించానంటూ చెప్పుకొచ్చాడు. అఆ చిత్రం షూటింగ్‌ సమయంలో కొన్ని సీన్స్‌ విషయంలో ఆయనతో వాదించానన్నాడు. అలా చేయడం వల్ల సినిమా హిట్‌ అవుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే నచ్చింది చేశామన్న తృప్తి మిగులుతుందని నితిన్‌ చెప్పుకొచ్చాడు. ఇకపై అలాంటి పనులు చేయను అని దర్శకులకు నచ్చినట్లుగా పూర్తి సహకారంతో నటిస్తానంటూ చెప్పుకొచ్చాడు.

మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఏడాది గ్యాప్‌ తీసుకున్నా. ఈ ఏడాది గ్యాప్‌ లో విన్న మూడు కథలు నచ్చడంతో ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాను. మూడు సినిమాలు చేయడం వల్ల చుక్కలు కనిపిస్తున్నాయి. ముగ్గురు మూడు విభిన్నమైన ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇవ్వమనడం తో నేను కన్ఫ్యూజ్‌ అయ్యేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక తన పెళ్లి దుబాయి లో జరపాలనే నిర్ణయం పూర్తిగా రెండు కుటుంబాలదని ఆయన చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News