సంయుక్త సైలెంట్ గానే దూసుకెళ్తుందిగా

సంయుక్త రీసెంట్ టైమ్స్ లో గ్లామ‌ర్ కంటే యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాల‌నే చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు.;

Update: 2026-02-12 18:30 GMT

సంయుక్త మీన‌న్ కు మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే మంచి గుర్తింపు ఉంది. అక్క‌డ చేసిన విభిన్న పాత్ర‌ల ద్వారా త‌న న‌ట‌నా సామ‌ర్థ్యాన్ని ఋజువు చేసుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అదే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. న‌ట‌నా ప్రాధాన్య‌మున్న పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ కెరీర్లో సంయుక్త మీన‌న్ ముందుకు వెళ్తున్నారు.

సంయుక్త రీసెంట్ టైమ్స్ లో గ్లామ‌ర్ కంటే యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాల‌నే చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. ప్ర‌స్తుత కాలంలో గ్లామ‌ర్ కంటే న‌ట‌న‌కు ప్రాధాన్య‌మిచ్చే హీరోయిన్ల కొర‌త ఎక్కువ‌వుతున్న నేప‌థ్యంలో సంయుక్త త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన స్థానం ఏర్ప‌ర‌చుకుంటున్నారు. సంయుక్త స్క్రీన్ పై సైలెంట్ గా క‌నిపించినా, ఫ్రేమ్ ను త‌న‌వైపు తిప్పుకునే సామ‌ర్థ్యం ఆమెకుంది.

నారీ నారీ న‌డుమ మురారితో స్పెష‌ల్ ఇంపాక్ట్

రీసెంట్ గా సంయుక్త‌ న‌టించిన సినిమాల్లో స్క్రీన్ పై ఆమె క‌నిపించే టైమ్ త‌క్కువైనా, త‌న ప్రెజెన్స్ తో ఆడియ‌న్స్ దృష్టిని పూర్తిగా ఆక‌ర్షించే శ‌క్తి ఆమెకు ఉంద‌ని తాజాగా మ‌రోసారి ప్రూవ్ అయింది. రీసెంట్ గా శ‌ర్వానంద్ న‌టించిన నారీ నారీ న‌డుమ మురారి సినిమాలో సంయుక్త క్యారెక్ట‌ర్ పెద్ద‌ది కాక‌పోయినా, తెర‌పై క‌నిపించిన ప్ర‌తీ ఫ్రేమ్‌లోనూ ఆమె స్పెష‌ల్ ఇంపాక్ట్ చూపించింది.

క‌ళ్ల‌లో ఆక‌ర్ష‌ణ‌, ఎమోష‌న్స్ ను ప‌లికించ‌డంతో పాటూ మంచి డైలాగ్ డెలివ‌రీ.. ఈ మూడు అంశాలు సినిమాలో ఆమె క్యారెక్ట‌ర్ ను హైలైట్ చేశాయి. క‌థ‌లో భాగంగా మాత్ర‌మే కాకుండా సీన్ కు బ‌లం చేకూర్చే న‌టిగా సంయుక్త న‌టించిన విధానం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఇక రీసెంట్ గా వ‌చ్చిన స్వయంభు టీజ‌ర్ లో కూడా అదే అంశం స్ప‌ష్టమైంది.

స్వ‌యంభు మూవీలో న‌భా న‌టేష్ గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ, సంయుక్త మాత్రం యోధురాలిలా క‌నిపిస్తూ టీజ‌ర్ తోనే త‌న‌దైన ముద్ర వేశారు. టీజ‌ర్ లో ఆమె లుక్, బాడీ లాంగ్వేజ్, యాక్ష‌న్ షాట్స్ లో క‌నిపించిన తీరు ఇవ‌న్నీ హైలైట్ గా నిల‌వ‌గా, గ్లామ‌ర్ కు భిన్నంగా, కంటెంట్ ఆధారంగా నిలిచే పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ ఆమె సైలెంట్ గానే త‌న కెరీర్ గ్రాఫ్ ను పెంచుకుంటున్నారు. చిన్న పాత్ర అయినా, పెద్ద ఇంపాక్ట్ చూపించగ‌ల న‌టిగా సంయుక్త మీన‌న్ పేరు బ‌లంగా వినిపిస్తోంది. స్వ‌యంభు లాంటి ప్రాజెక్టులు ఆమెకు మ‌రిన్ని అవ‌కాశాలు తెచ్చి పెట్టే అవ‌కాశ‌ముంది.

Tags:    

Similar News