నితిన్ సీక్రెట్ లుక్ తెలిసిపోయిందిగా..

Update: 2017-01-19 04:35 GMT
ఇప్పుడు దాదాపు ప్రతీ హీరో కూడానూ ఏదో ఒక కొత్త లుక్ తో కనిపించాలనే ప్రయత్నిస్తున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ నుండి రామ్ చరణ్‌ ధృవ వరకు.. దాదాపు గతేడాది మన హీరోలందరూ కొత్త లుక్స్ తో ఆకట్టుకున్నావరే. ఇప్పుడు ఈ హీరోల సరసన యంగ్ హీరో నితిన్ కూడా చేరిపోతున్నాడు.

ఆల్రెడీ హను రాఘవపూడి డైరక్షన్లో నితిన్ చేస్తున్న సినిమా షూటింగ్ మొదలైపోయింది. ఈ సినిమాలో నితిన్ కొత్త లుక్ తో కనిపిస్తాడని మొన్నటివరకు టాక్ ఉండేది. ఇప్పుడు అది నిజం అని కూడా తేలిపోయింది. ఆ సీక్రెట్ ఏంటో అవుట్ అయిపోయింది. ఎందుకంటే సినిమా షూటింగ్ స్టిల్స్ కొన్నింటిని చూస్తుంటే.. స్టయిలిష్‌ గా పెంచిన గెడ్డంతో నితిన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. క్రింద పార్టులో కాస్త లెంగ్తీగా ఉండే గెడ్డం స్టయిల్ తో నితిన్ ఆకట్టుకున్నాడనే చెప్పాలి. ఇప్పటివరకు ఇటువంటి స్టయిల్లో ఎప్పుడూ కనిపించని ఈ యంగ్ హీరో.. ఇప్పుడు కొత్త కంటెంట్ కు కొత్త లుక్ యాడ్ చేసి.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడేమో చూడాలి.

ఇకపోతే ఈ సినిమా తరువాత నితిన్ చేయబోయే మరో సినిమా.. పవన్ సమర్పణతో త్రివిక్రమ్ ప్రొడక్షన్లో.. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య డైరక్షన్లో రాబోయే సినిమా. ఈ మూవీలో కూడా మరో కొత్త లుక్ తో మనోడు ఇరగదీస్తాడట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News