అరుదైన రికార్డును అలా సెట్ చేసిన నితిన్!

Update: 2022-02-27 09:30 GMT
తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచపటాన్ని ఆక్రమిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ సినిమాలు మరింత చేరువవుతున్నాయి. భారీ బడ్జెట్ తో ఇక్కడ నిర్మితమైన సినిమాలు నేరుగా హిందీలో విడుదలవుతున్నాయి. ఇక ఒక మాదిరి బడ్జెట్ తో ఇంతకుముందు తెలుగులో చేసిన సినిమాలు హిందీలోకి అనువాదమై యూ ట్యూబ్ ఛానల్స్ లో తమ జోరును చూపుతున్నాయి.

దాంతో టాలీవుడ్ హీరోలు హిందీ ప్రేక్షకుల మనసులలో కూడా స్థానం సంపాదించుకుంటున్నారు. అక్కడ కూడా తమ అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు.

సినిమా అనేది ఇప్పుడు ప్రేక్షకుడి అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ రూపంలో వచ్చేయడంతో, హీరోలంతా తమ సినిమాలు హిందీలోకి డబ్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హిందీ అనువాద హక్కులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ రూపంలో నిర్మాతలకు పెద్ద మొత్తమే చేతికి వస్తోంది.

ఇక తమ తాజా చిత్రాలు హిందీలోను రిలీజ్ చేసుకోవడానికి గాను, యూ ట్యూబ్ అనువాదాల ద్వారా వచ్చిన గుర్తింపు .. క్రేజ్ హీరోలకు ఉపయోగపడుతోంది. అలా యూ ట్యూబ్ లో హిందీ  అనువాదాల పరంగా ఎక్కువ వ్యూస్ ను దక్కించుకుంటున్న సౌత్ హీరోల జాబితాలో రామ్ - నితిన్ కనిపిస్తున్నారు.

వివిధ యూ ట్యూబ్ ఛానల్స్ లో తన సినిమాల హిందీ అనువాదాల ద్వారా రామ్ 2 బిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంటే, నితిన్ సినిమాలకి 2.3 బిలియన్ వ్యూస్ లభించడం విశేషంగా చెబుతున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.

యూ ట్యూబ్ లో హిందీ డబ్బింగ్ సినిమాలకి సంబంధించిన ఈ స్థాయి మార్క్ ను అందుకున్న సౌత్ ఇండియా హీరో నితిన్ అని చెబుతున్నారు. నితిన్ ముందా? .. రామ్ ముందా? అనే విషయాలను పక్కన పెడితే, ఇద్దరూ మన తెలుగు హీరోలు కావడం ఆనందించవలసిన విషయం.

ఇక నితిన్ విషయానికి వస్తే టీనేజ్ లోనే నితిన్ స్టార్ డమ్ చూశాడు .. వరుస పరాజయాలను చూశాడు. టీనేజ్ లో వరుస ఫ్లాప్ లు ఎదురైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను సొంతం చేసుకున్న గొప్ప లక్షణం ఆయనలో కనిపిస్తుంది. అలాగే యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలోను ఆయన సక్సెస్ అయ్యాడు.

ప్రస్తుతం ఆయన 'మాచర్ల నియోజక వర్గం' సినిమా చేస్తున్నాడు. ఆయన సొంత బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఏప్రిల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హిందీ రైట్స్ కూడా భారీ రేటు పలుకుతుండటం విశేషం.      
Tags:    

Similar News