• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వావ్.. కమల్-విక్రమ్...

వావ్.. కమల్-విక్రమ్ సినిమాలో నితిన్?

By - Tupaki Desk
Update: 2018-03-06 11:33 GMT
ఒక దశాబ్దం పాటు ఫ్లాపులతో అల్లాడిపోయాడు యువ కథానాయకుడు నితిన్. ఐతే ‘ఇష్క్’ దగ్గర్నుంచి అతడి దశ తిరిగింది. ఆ తర్వాత ‘గుండె జారి గల్లంతయ్యిందే’.. ‘అఆ’ లాంటి బ్లాక్ బస్టర్లతో తన స్థాయిని పెంచుకున్నాడతను. విక్రమ్ కుమార్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి పెద్ద దర్శకులతో అతను సినిమాలు చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల నిర్మాణంలో ‘చల్ మోహన రంగ’ చేస్తున్నాడు. దీని తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’లో నటించనున్నాడు నితిన్. ఇప్పుడు నితిన్ కు మరో బంపరాఫర్ తగిలినట్లుగా వార్తలొస్తున్నాయి. అతను ఓ తమిళ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడట. ఆ సినిమా చేస్తోందెవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

దిగ్గజ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో విక్రమ్ హీరోగా తెరకెక్కబోయే కొత్త సినిమాలో నితిన్ కు ఒక కీలక పాత్ర ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ శిష్యుడు రాజేష్ సెల్వ రూపొందించనున్నాడు. చాలా ఏళ్లుగా కమల్ దగ్గర పని చేస్తున్న రాజేష్.. తన గురువుతోనే ‘చీకటి రాజ్యం’ సినిమా చేశాడు. ఆ సినిమా పర్వాలేదనిపించింది. ‘చీకటి రాజ్యం’ ఓ ఫ్రెంచ్ థ్రిల్లర్ కు అఫీషియల్ రీమేక్. ఇప్పుడు కూడా మరో ఫ్రెంచ్ మూవీనే ఈ టీం రీమేక్ చేయనుందట. ఇంత పెద్ద కాంబినేషన్లో నితిన్ కు కీలక పాత్ర దక్కడం విశేషమే. ఈ చిత్రం తెలుగులోనూ ఒకేసారి తెరకెక్కనుంది. జిబ్రాన్ సంగీతాన్నందిస్తాడు. ఈ సినిమాలో నితిన్ నటిస్తున్న విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
Tags:    
  • Nithin 
  • Kamal 
  • Vikram 
  • Telugu News 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS