• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరీకి నితిన్ థ్యాంక్స్...

పూరీకి నితిన్ థ్యాంక్స్ చెప్పాల్సిందే

By - Tupaki Desk
Update: 2015-07-21 16:59 GMT
నిజం చెప్పాలంటే ‘హార్ట్ అటాక్’కు ముందు పూరి జగన్నాథ్‌ తో పోలిస్తే నితిన్ బెటర్ పొజిషన్లో ఉన్నాడు. అప్పటికి పూరి కెమెరామన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో.. లాంటి ఫ్లాపులతో వెనకబడిపోయి ఉన్నాడు. కానీ నితిన్ మాత్రం ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే లాంటి సూపర్ హిట్లతో జోరు మీద ఉన్నాడు. అలాంటి సమయంలో పూరి సినిమా చేద్దామంటే ఆయన ట్రాక్ రికార్డు గురించి ఆలోచించకుండా.. డైరెక్టర్ గా పూరికి ఉన్న ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ‘హార్ట్ అటాక్’కు ఓకే చెప్పాడు నితిన్. ఆ సినిమా ఇద్దరికీ మంచి ఫలితాన్నే ఇచ్చింది. ముఖ్యంగా పూరిని ఈ సినిమా మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కించి.. మళ్లీ పెద్ద హీరోలు తన వైపు చూసేలా చేసింది. ఎన్టీఆర్‌ తో టెంపర్ చేయడానికి కూడా ‘హార్ట్ అటాక్’ ఒకరకంగా ఉపయోగపడింది.

ఐతే తాను కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండగా తనతో సినిమా చేసి పరోక్షంగా సాయపడ్డ నితిన్‌ తో ఈ మధ్య పూరి ఓ సినిమా ఓకే చేసి.. దాన్ని నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కు మళ్లించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు రద్దయిన సమయంలో అనుకోని కారణాల వల్ల సినిమా మెటీరియలైజ్ కావట్లేదని నితిన్ ట్వీట్ చేస్తే.. నితిన్ తో చేయాల్సిన సినిమానే వరుణ్ తో చేస్తున్నట్లు పూరి వ్యాఖ్యానించడాన్ని బట్టి ఇద్దరికీ ఎక్కడో తేడా వచ్చిందని అర్థమైంది. ఐతే పూరి సినిమా మిస్సయినా పెద్దగా ఫీలవకుండా ఇప్పుడు మరో టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో సినిమా ఓకే చేశాడు నితిన్. త్రివిక్రమ్, పూరి ఇద్దరూ స్టార్ డైరెక్టర్లే కానీ.. పూరి చిన్న సినిమాలు కూడా చేస్తుంటాడు కాబట్టి.. అతడి దర్శకత్వంలో ఎవరైనా నటించొచ్చు. కానీ పవన్, మహేష్, బన్నీ లాంటి పెద్ద స్టార్ల తో మాత్రమే సినిమాలు చేసే త్రివిక్రమ్ తో నితిన్ పని చేయబోతుండటం అదృష్టమే అని చెప్పాలి. ఈ అదృష్టం తన తలుపు తట్టడానికి కారణమైన పూరీకి నితిన్ థ్యాంక్స్ చెప్పాల్సిందే.
Tags:    
  • Nithin 
  • Trivikram 
  • puri Jagannath 
  • telugu NEws 

Similar News

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

తాగుబోతు పాత్ర కోసం మందు తాగారా?

2026-11-18 09:52 GMT

క‌రాటే చంద్ర‌న్ కోసం క‌రాటే ప్రాక్టీస్ చేస్తున్నాడు!

2026-11-18 09:51 GMT

గోదారి గట్టు, మీసాల పిల్లను మించి మరోటి..!

2026-11-18 07:46 GMT

నిజ జీవితంలోనూ గ్రేట్.. మనవళ్లతో గ్రీస్ వెకేషన్‌లో తలైవా!

2026-11-18 07:46 GMT

గ్రీస్ వెకేషన్‌లో స్టార్‌క‌పుల్ రొమాన్స్.. వ‌య‌సు ఒక అంకె మాత్ర‌మే!

2026-11-18 07:46 GMT

స్కూల్‌లో మొదలైన పరిచయం... తన భార్య అమల్‌తో లవ్ స్టోరీ చెప్పిన దుల్కర్ సల్మాన్!

2026-11-18 07:24 GMT

'మైసా' కోసం రణబాలి రానున్నాడా?

2026-11-18 07:14 GMT

కొత్త జేమ్స్ బాండ్ సినిమాలో విలన్‌గా బ్రాడ్ పిట్?

2026-11-18 07:13 GMT

Copyright @2026

Powered by Blink CMS