నాని హీరోయిన్ తో భీష్మ రొమాన్స్

Update: 2020-04-30 04:30 GMT
నాని గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంలో హీరోయిన్‌ గా నటించిన ప్రియాంక అరూల్‌ మోహన్‌ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో తన రెండవ సినిమా శ్రీకారంను శర్వానంద్‌ తో కలిసి చేస్తోంది. శ్రీకారం సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ఈ సమ్మర్‌ లో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడినది. శ్రీకారం విడుదల కాకుండానే ఈ తమిళ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమా ఛాన్స్‌ కొట్టేసింది.

బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ అంధాధున్‌ ను తెలుగులో నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రీమేక్‌ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా కథను మార్చుతున్నారట. ఇక ఈ చిత్రంలో నితిన్‌ కు జోడీగా ప్రియాంక అరూల్‌ ను దాదాపుగా కన్ఫర్మ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ లాక్‌ డౌన్‌ లేకుండా ఉంటే సినిమా షూటింగ్‌ ఇప్పటి వరకు ప్రారంభం అయ్యేంది.

నితిన్‌ రంగ్‌ దే చిత్రంతో పాటు ఈ రీమేక్‌ ను కూడా ఇదే ఏడాదిలో విడుదల చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. భీష్మ చిత్రంతో సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కిన నితిన్‌ ఈ రెండు సినిమాలతో హ్యాట్రిక్‌ కొట్టాలనుకున్నాడు. కాని కరోనా వల్ల రీమేక్‌ పనులు ఆగి పోయాయి. కాని లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన వెంటనే షూటింగ్‌ ను ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో హీరోయిన్‌ ను ఖరారు చేశారు.

ఆన్‌ లైన్‌ ద్వారానే ప్రియాంక అరూల్‌ కు దర్శకుడు మేర్లపాక గాంధీ స్క్రిప్ట్‌ ను వినిపించడంతో పాటు ఇతర చర్చలు జరిపాడట. ఈ ఏడాదిలో ఎప్పుడు షూటింగ్‌ ఆరంభించినా వచ్చే ఏడాది సమ్మర్‌ తర్వాతే ఈ రీమేక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News