ఓటీటీ మినీ రివ్యూ: 'నిన్నిలా నిన్నిలా'

Update: 2021-03-01 14:30 GMT
అశోక్ సెల్వ‌న్‌ - నిత్యామీన‌న్‌ - రీతూవ‌ర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అర్బన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''నిన్నిలా నిన్నిలా''. బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌ పై బీవీఎస్ఎన్‌ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అని శ‌శి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై ఆసక్తిని కలిగించిన మేకర్స్ 'నిన్నిలా నిన్నిలా' చిత్రాన్ని జీ ప్లెక్స్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో పే ఫర్ వ్యూ విధానంలో విడుదల చేశారు.

కథ విషయానికొస్తే కండరాల నొప్పులు - నిద్రలేమితో బాధపడుడే దేవ్ (అశోక్ సెల్వన్) లండన్‌ లోని ఓ భారతీయ రెస్టారెంట్ లో జూనియర్ చెఫ్‌ గా కెరీర్ ప్రారంభిస్తాడు. అక్కడ మాస్టర్ చెఫ్ (నాజర్) ను ఫాలో అయ్యే ఓసీడీ ప్రాబ్లమ్ ఉన్న మరో చెఫ్ తారా (రీతు వర్మ)ను కలుస్తాడు. అక్కడ వారి మధ్య పరిస్థితులు.. హెడ్ చెఫ్ వంట మానేయడానికి కారణమేంటి?, వీరి లైఫ్ లో మాయ(నిత్య మీనన్) పాత్ర ఎంటనేది ఈ సినిమా.

'నిన్నిలా నిన్నిలా' చిత్రంలో లీడ్ యాక్టర్స్ నటనకు ఓటీటీ ఆడియన్స్ మంచి మార్కులే వేస్తున్నారు. ముఖ్యంగా అశోక్ సెల్వన్ విచిత్రమైన చెఫ్ పాత్రలో ప్రశంసలు అందుకుంటున్నాడు. పూర్తిగా లండన్ లో చిత్రీకరించిన ఈ సినిమాలో సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి విజువల్స్ అదనపు ఆకర్షగా నిలిచాయి. అలానే 'ప్రేమమ్' ఫేమ్ రాజేష్ మురుగేసన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

అయితే స్లో నెరేషన్.. కథలోని త్వరగా వెల్లకపోవడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్స్ గా చెప్తున్నారు. అలానే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఆర్టిఫిషల్ గా ఉందనే ఫీలింగ్ తెప్పిస్తుంది. దర్శకుడు శశి ఫ్రెష్ కథని తీసుకున్నప్పటికీ బోరింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించాడు. అలానే లెన్తీ సీన్స్ మంచి విజువల్స్ తో ప్రెజెంట్ చేయాలని ప్రయత్నించినప్పటికి ఎమోషన్స్ పండించడంలో విఫలమయ్యాడు. అయితే ఎండింగ్ ఆసక్తికరంగా ఉండటం.. నటీనటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఏదేమైనా 'నిన్నిలా నిన్నిలా' సినిమా ఓటీటీలో విడుదల అవడంతో కొన్ని చోట్ల ఫార్వర్డ్ చేసుకుంటూ ఓ సారి చూడొచ్చని చెప్పవచ్చు.
Tags:    

Similar News