పెళ్ల‌య్యాక 8-ప్యాక్ ఎందుకు హీరో గారూ?

Update: 2020-07-18 04:45 GMT
పెళ్ల‌య్యాక ఎవ‌రికైనా సోకులు త‌గ్గుతాయ‌ని అంటారు. కానీ ఈ యంగ్ హీరో ఏమిటి...?  6 ప్యాక్ ని కాస్తా 8 ప్యాక్ గా డెవ‌ల‌ప్ చేస్తున్నాడ‌ట‌?  .. ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తాజా ప్ర‌య‌త్నంపై ఫిలింస‌ర్కిల్స్ లో గుస‌గుస‌ ఇది.

ఇంత‌కీ ఎందుకీ ప్ర‌య‌త్నం? అంటే.. చాలా చాలా కార‌ణాలే ఉన్నాయి. ఇలా పెళ్లాడేసి అలా కెరీర్ ని ప‌రుగులు పెట్టించాల‌ని సీరియ‌స్ గా ప్లాన్ చేశాడు. వ‌రుస‌గా రెండు సినిమాల్ని శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌ని సీరియ‌స్ గా డెసిష‌న్ తీసుకున్నాడు. కానీ మ‌హ‌మ్మారీ మాత్రం గ్యాప్ ఇవ్వ‌కుండా షంటేస్తోంది.  ఎలానూ సెట్స్ కెళ్లే ఛాన్స్ దొర‌క‌లేదు. అందుకే ప్ర‌స్తుత‌ క్వారంటైన్  టైమ్ లో ఏం చేయాలి? అన్న‌ది ఆలోచించిన నిఖిల్ కి ఈ ఆలోచ‌న వ‌చ్చింద‌ట‌.

6 ప్యాక్ పాత‌బ‌డిపోయింది. అందుకే ఇప్పుడు 8 ప్యాక్ ని ట్రై చేస్తున్నాడ‌ట‌. మునుముందు రాబోయే చిత్రాల్లో స‌రికొత్త‌ ప్యాకింగ్ తో స‌ర్ ప్రైజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. లాక్ డౌన్ ఎటూ తెగేట్టు లేద‌ని పెళ్లి కానిచ్చేశాడు. ఆ త‌ర్వాత ఖాళీ స‌మ‌యాన్ని ఏమాత్రం వృథా చేయ‌డం ఇష్టం లేదు. అందుకే యాబ్స్ పై దృష్టి సారించాడ‌ట‌. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే కార్తికేయ సీక్వెల్ స‌హా 18 పేజెస్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆ రెండు చిత్రాలు త‌న కెరీర్ కి ఎంతో స్పెష‌ల్ కానున్నాయి. అందుకే లుక్ ప‌రంగా కూడా పూర్తిగా ఛేంజ్ చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

ఇక 8 ప్యాక్ వ‌ర్క‌వుట్ సెష‌న్స్ అయిపోయాక కూడా ఇంకా టైమ్ దొరికితో అదిరిపోయే స్క్రిప్టులు రాసే ప‌ని పెట్టుకున్నాడ‌ట నిఖిల్. ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే 2021లో అడుగు పెట్టినా వైర‌స్ గ్యాప్ ఇచ్చేట్టు లేదు. ఆ క్ర‌మంలోనే నిఖిల్ ట్ర‌య‌ల్స్ అన్నీ విజ‌య‌వంతంగా పూర్త‌వుతాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News