'విత్ పీకే'.. పవన్ వెంట యంగ్ హీరో

Update: 2019-05-24 11:50 GMT
ఏ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలువుతుంది.. ఎంతటి లక్ష్యమైనా చిన్నగా రూపుదిద్దుకుంటోంది. మొదట్లో ఓటమి వచ్చినా.. కడవరకూ నిలిచి పోరాడేవాడే మనిషి. ఓటమి నుంచి గెలుపును వెతుక్కుంటూ ప్రయత్నించడమే విజయ రహస్యం.. ఇప్పుడు ఏపీలో కుదేలైన జనసేన పార్టీకి - ఆ పార్టీ అధినేతకు భరోసాగా మేమున్నామంటూ ముందుకువస్తున్నారు..

ఏపీ ఎన్నికల్లో జనసేన కుదలైంది.. జనసేనాని పవన్ సైతం రెండు చోట్ల పోటీచేస్తే రెండింట్లో ఓడిపోయారు. ఒక్క రాజోలు లో మాత్రమే జనసేన గెలిచి సింగిల్ డిజిట్ కు పరిమితమైంది. ఉన్నత ఆశయాలు..పేదలు - ప్రజల ఆకాంక్షలు నెరవేరడం కోసం కోట్లు వస్తున్న సినిమా ఫీల్డ్ ను వదిలి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశారు. ప్రచారంలోనూ తన నిజాయితీని చాటారు. తన అన్న నాగబాబును కూడా ఎంపీగా పోటీ చేయించారు. కనీసం 25 అసెంబ్లీ సీట్లు వచ్చి కింగ్ మేకర్ అవుతాడనుకున్న పవన్.. ఒక్క సీటుకే పరిమితమై ఘోర ఓటమిని తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ఎంపీలు - ఎమ్మెల్యేలుగా పవన్ తో సహా చిత్తుగా ఓడిపోయారు.

పవన్ ఓటమికి  పవన్ ఫ్యాన్స్ - మెగా అభిమానులు - సాధారణ ప్రజలు కూడా కలవరపడేలా చేసింది. ఈ దారుణ పరాభావం ఎదురైనా తాను ప్రజల్లోనే ఉంటానని.. పోరాడుతానని పవన్ చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. జనాభిప్రాయం ఎలా ఉన్నా గుండె నిబ్బరంతో మనోధైర్యాన్ని చాటిన పవన్ కు ఇప్పుడు మద్దతుగా యంగ్ హీరో నిఖిల్ ఒక కొత్త భరోసా ఉద్యమాన్ని చేస్తున్నారు.

యంగ్ హీరో నిఖిల్ ‘విత్ పీకే’ యాష్ ట్యాగ్ తో పవన్ ఓడినా.. గెలిచినా.. తాము పవన్ వెంటే అంటూ అర్థం వచ్చేలా ట్విట్టర్ లో మద్దతు పలికారు. విత్ పీకే హ్యాష్ ట్యాగ్ తో జనసేన కేడర్ - పవన్ లోనూ మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ తో పవన్ అభిమానులు, సాధారణ ప్రజలు పవన్ కు మద్దతుగా పెద్ద ఎత్తున మెసేజీలు పెడుతున్నారు.

   

Tags:    

Similar News