• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విడుద‌ల వాయిదా ప‌డ‌టం...

విడుద‌ల వాయిదా ప‌డ‌టం మంచిదేన‌ట..‌

By - Tupaki Desk
Update: 2019-04-25 14:30 GMT
సినిమా అనుకున్న టైమ్ కి రిలీజ్ అవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల న‌ష్టాలే ఎక్కువ‌ని - అదో అశుభ‌మ‌ని ఇండ‌స్ట్రీలో న‌మ్ముతూ ఉంటారు. ఇది న‌మ్మ‌క‌మే కాదు నిజం కూడా - ఎందుకంటే సినిమాని రిలీజ్ చేయాలంటే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర నుంచి - ప‌బ్లిసిటీ - రిలీజ్ త‌రువాత శాటిలైట్ ఎగ్రిమెంట్స్ ఇలా చాలా పంచాయితీలు ఉంటాయి. వాటిని అన్ని స‌క్ర‌మంగా స‌రి చేసుకుంటూ ఓ సినిమాని రిలీజ్ చేయాలి - అన్నిటికంటే ప్రేక్ష‌కుల దృష్టిని ఆ రిలీజ్ డేట్ పై ప‌డేలా చేయ‌డం క‌త్తి మీద సామే. దీనికి తోడు ప‌లుమార్లు రిలీజ్ డేట్ మారిన సినిమాలు ఫ్లాప్ అవుతుంటాయ‌ని ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఇండ‌స్ట్రీలో ఉంది.

అయితే ఈ బ్యాడ్ సెంటిమెంట్స్ త‌న‌కు అనుకూలంగా మార్చేసుకుంటున్నాడు హీరో నిఖిల్ - మ‌నోడు సినిమాలు వాయిదా ప‌డితేనే బ్లాక్ బ‌స్ట‌ర్స్ అవుతున్నాయి. నిఖిల్ కెరీర్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన కార్తీకేయ అనేక‌సార్లు వాయిదా ప‌డి చివర‌కు రిలీజై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకుంది. ఆ త‌రువాత నిఖిల్ ని స్టార్ హీరోని చేసిన ఎక్క‌డకి పోతావు చిన్న‌వాడా విష‌యంలో కూడా రిలీజ్ డేట్ అనేక‌సార్లు మారింది. క‌ట్ చేస్తే ఈ సినిమాను కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. ఇప్పుడు నిఖిల్ లేటెస్ట్ మూవీ - అర్జున్ సుర‌వ‌రంలో కూడా విడుద‌ల తేదీ వాయిదా ప‌డుతూనే ఉంది. ముందు ఫిబ్ర‌వరి రిలీజ్ అని - ఆ త‌రువాత మార్చి అని ఇప్పుడు మే అని అనేకసార్లు ఈ సినిమా రిలీజ్ ని మారుస్తూ వ‌చ్చారు. ఇప్పుడు మే 1 విడుద‌ల కావాల్సిన ఈ సినిమాను రెండు వారాలు వెన‌క్కి జ‌రిపి మే 17న విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం ఎవెంజర్స్ మేనియా బాక్సాఫీస్ పై అసాధ‌ర‌ణ రీతిలో ఉండ‌టం - దానికీ తోడు ఎవెంజ‌ర్స్ హంగామా ముగిసిన వెంట‌నే మ‌హ‌ర్షి రూపంలో మ‌రో పెద్ద సినిమా రిలీజ్ ఉండ‌టంతో - ఈ రెండు సినిమాలు హ‌డావ‌డి తగ్గాకే అర్జున్ సుర‌వ‌రంను ప్రేక్ష‌కుల ముందుకి తీసుకురావ‌ల‌ని నిఖిల్ అండ్ టీమ్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా వినిపిస్తుంది. డిస్ట్రీబ్యూట‌ర్స్ స‌ల‌హా సూచ‌న‌లు అనుస‌రించే అర్జున్ సుర‌వ‌రం విడుద‌లను వాయిదా వేస్తున్న‌ట్లుగా నిఖిల్ చెబుతున్నాడు.


Tags:    
  • Nikhil 
  • Arjun Suravaram Movie 
  • telugu News 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS