• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నిఖిల్ 'ముద్ర‌' కు ఆ...

నిఖిల్ 'ముద్ర‌' కు ఆ రెండూ అడ్డు

By - Tupaki Desk
Update: 2018-10-25 04:32 GMT
యంగ్ హీరో నిఖిల్ సినిమా వ‌స్తోంది అంటే ఫ్యాన్స్ - ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఒక‌టే క్యూరియాసిటీ ఉంటుంది. యూనిక్ కాన్సెప్టుల్ని ఎంచుకుని, ఇమేజ్‌తో ప‌నే లేకుండా కొత్త‌గా, డేరింగ్‌గా క‌నిపిస్తాడ‌న్న న‌మ్మ‌కం - భ‌రోసా నిఖిల్‌ ని చూస్తే మార్కెట్ వ‌ర్గాల‌కు ఉంది. అందుకే గ‌త కొంత‌కాలంగా అత‌డు న‌టిస్తున్న `ముద్ర‌` ఎప్పుడొస్తుందా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమా ఎందుకో అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. ఇదిగో వ‌స్తుంది.. అదుగో వ‌స్తుంది! అంటూ అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నా డిలే ఇబ్బందిక‌రంగా మారిందన్న మాటా వినిపిస్తోంది.

గ‌త కొంత‌కాలంగా  ఈ సినిమా టైటిల్ వివాదం కాస్త ఇబ్బందిక‌రంగానే మారింది. `ముద్ర` టైటిల్‌ ని వేరొక‌రు రిజిష్ట‌ర్ చేయించుకోవ‌డం - దానిని ఇంకొక‌రు తీసుకుని సినిమా తీయ‌డం జ‌రిగాయట‌. అయితే `ముద్ర‌` టైటిల్‌ ని తాము ప్ర‌క‌టించాకే - వేరొక‌రు ఆ టైటిల్‌ ని రిజిష్ట‌ర్ చేయించార‌ని ఠాగూర్ మ‌ధు ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలోనూ క్లారిటీ ఇచ్చారు. సినిమా పూర్త‌యింది క‌దా? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న కాస్తంత అస్ప‌ష్ట‌మైన‌ స‌మాధాన‌మిచ్చారు.

ఇప్ప‌టికే `ముద్ర‌` సినిమాని ఈ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న రిలీజ్ చేయాల‌నుకుంటోంది టీమ్. నిర్మాత‌ల వైపు నుంచి ఆలోచ‌న అది. కానీ ఈ నెలంతా అన్నీ భారీ సినిమాలున్నాయి. `ముద్ర` రిలీజ్ గురించి ఆలోచిస్తున్నాం. న‌వంబ‌ర్ 8న బాలీవుడ్ క్రేజీ చిత్రం `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` అత్యంత భారీగా రిలీజ‌వుతోంది. కాస్త అటూ ఇటూ వెళ‌దామంటే న‌వంబ‌ర్ 29న ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `2.ఓ` రిలీజ‌వుతోంది. ఈ రెండు పెద్ద‌ సినిమాల మ‌ధ్య‌లో రిలీజ్ చేయాల్సిన స‌న్నివేశం ఉంటుందేమో.. అంటూ కాస్త సందిగ్ధ‌త‌ను `ముద్ర` స‌మ‌ర్ప‌కుడు ఠాగూర్ మ‌ధు వ్య‌క్తం చేశారు. మంచి రిలీజ్ తేదీ సినిమా విజ‌యానికి కార‌ణ‌మ‌వుతోంది కాబ‌ట్టి, దానికోసం వేచి చూస్తున్నామ‌నే ధోర‌ణి అత‌డిలో క‌నిపించింది. నిఖిల్ జ‌ర్న‌లిస్టు పాత్ర‌లో న‌టిస్తున్న థ్రిల్ల‌ర్ మూవీ ముద్ర‌.  ఈ చిత్రంలో లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు టి.ఎన్‌.సంతోష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


Tags:    
  • Nikhil 
  • Mudra Movie 
  • Telugu News 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS