పవన్ ని వాడుకుంటున్న మరో యంగ్ హీరో

Update: 2015-10-13 16:06 GMT
వాడుకోవాలేగానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ కామధేనువు లాంటిదని మన టాలీవుడ్ లో ఇప్పటికే పలుమార్లు రుజువయ్యింది. పవన్ పేరుతొ పాటలు, పవనిజం అంటూ సినిమాలు, ఇటీవల ఏకంగా పవనిజం డే అంటూ ప్రత్యేకంగా రోజులతో పవన్ ని వాడుకుంటూ టాలీవుడ్ లో మనుగడ సాధిస్తున్నవారి సంఖ్య బాగానే వుంది. అయితే తమ ప్రియతమ హీరోపై అభిమానాన్ని చూపించే దశలోనే ఈ ఘటనలన్నీ జరుగుతున్నాయని ప్రేక్షకులకు భావన కలిగించడం విశేషం.

టాలీవుడ్ లో హార్డ్ కోర్ పవన్ ఫ్యాన్ గా వెలిగే నితిన్ ఇటీవల దాదాపు ప్రతీ సినిమాలో అతన్ని వాడుకునే ప్రయత్నం చేసాడు. తన సినిమా ఆడియో లాంచ్ లకు రప్పించాడు. ఇదే బాటలో ఇప్పుడు మరో యువహీరో పవన్ ని, అతని క్రేజ్ ని ఉపయోగించుకునే పనిలో వున్నాడు.

హ్యాట్రిక్ విజయాలతో తిరిగి ఫామ్ ని అందుకున్న యువహీరో నిఖిల్ ప్రస్తుతం స్టార్ రైటర్ కోనా వెంకట్ సమర్పణలో శంకరాభరణం అనే క్రైమ్ కామెడీలో నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమా టీజర్ రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా విడుదలకానుందని, ఇందుకు తనకు చాలా సంతోషంగా వుందని నిఖిల్ ట్వీటాడు. పవన్ చెయ్యి పడడంతో ఈ సినిమా సడన్ గా వార్తలలో నిలిచింది. పవర్ స్టారా మజాకా...  
Tags:    

Similar News