#నిహారిక పెళ్లి.. శ‌శిరేఖ రూపంలో ఘ‌టోత్క‌చుడినే త‌ల‌పించింది!

Update: 2020-12-10 03:59 GMT
నిహారికా - చైతన్యల వివాహ మ‌హోత్స‌వంలో అరుదైన దృశ్య‌మిది. కుంద‌న‌పు బొమ్మ నిహారిక ఇచ్చిన ఈ ఫోజు చూశారుగా.. అచ్చం సావిత్రిని హైజాక్ చేసింది. మెగా వెడ్డింగ్ లో శ‌శిరేఖా ప‌రిణ‌యం ఘ‌ట్టంలా ఉంది సుమీ. నిహారిక ప‌ర్ఫెక్ట్ ఎక్స్ ప్రెష‌న్ తో పెళ్లికి వ‌చ్చిన వారంద‌రినీ స్పెల్ బౌండ్ చేసేసింద‌నే చెప్పాలి.

ఎర్ర‌ని కంచి ప‌ట్టు చీర‌లో త‌ళ‌త‌ళా మెరిసిపోతున్న నిహారిక న‌డుముకు వ‌డ్డానం టాప్ టు బాట‌మ్ ఆభ‌ర‌ణాలు ధ‌రించి ముక్కుకు ముక్కెర‌ను ధ‌రించి శశిరేఖ‌నే త‌ల‌పిస్తోంది. మెగా కుటుంబంలోని పాపుల‌ర్ స్టార్లంతా ఓ చోట చేరి పెళ్లి సంద‌డిలో మాయాబ‌జార్ సృష్టించార‌ని అర్థ‌మ‌వుతోంది. అతిథులంతా ఒకే చోట గుమిగూడి నృత్యాలు ఇతర వివాహ కార్యక్రమాలతో ఎంతో సంద‌డి చేశారు. నిన్న సాయంత్ర‌మే నిహారిక - చైత‌న్య జంట వివాహం జ‌రిగింది. ఉదయపూర్ ‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ సంద‌డి ఆకాశాన్ని తాకింది.

వివాహ ఉత్సవాల‌కు సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో వధువు ఇలా అద్భుత‌మైన ఎక్స్ ప్రెష‌న్ తో ఆక‌ట్టుకుంది. ఇది మాయాబజార్ చిత్రం నుండి సావిత్రమ్మ  ఐకానిక్ పోజ్ కి ఏమాత్రం త‌గ్గ‌లేదు. అక్కడ ఆమె ‘ఆహా నా పెళ్లి అంట‌’ నంటూ పాడింది. ఆ వస్త్రధారణ.. ఆహార్యం వ్యక్తీకరణ అలా న‌డుముపై  చేతులతో.. నిహారిక శ‌శిరేఖ నే త‌ల‌పించింది. ఘ‌టోత్క‌చుడుగా మారిన శ‌శిరేఖ‌నే గుర్తు చేసింది సుమీ.
Tags:    

Similar News