#నిశ్చ‌య్‌.. ఉద‌య్ ‌పూర్ ‌లో కొత్త జంట విహారం!

Update: 2020-12-11 04:11 GMT
ఉదయ్ పూర్ ‌లో మెగా డాట‌ర్ నిహారిక డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ పెళ్లిలో మెగా ఫ్యామిలీ అంతా సంద‌డి చేశారు. బుధ‌వారం రాత్రి 7:15 నిమిషాల‌కు నిహారిక‌- జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌ల వివాహం అంగ‌రంగ వైభ‌వంగా గ్రాండ్ గా జ‌రిగింది. పెళ్లి త‌రువాత ఈ జంట ఉద‌య్ పూర్ లో విహ‌రిస్తోంది. వీరి విహారానికి సంబంధించిన ఓ ఫొటో సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది.

వివాహానంతర కొత్త ఫోటోలో నిహారికా తెల్ల కుర్తాలో రెబాన్ గాగుల్స్ పెట్టుకుని అందంగా కనిపిస్తుండగా.. చైతన్య ఆఫ్ వైట్ కుర్తాతో ఆక‌ట్టుకుంటున్నాడు. ప్యాలెస్ వద్ద ఈ జంట ఫొటోకి పోజులిస్తూ సంతోషంగా కనిపిస్తోంది. నిహారిక- చైత‌న్య‌ల వెడ్డిండ్ లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ, .. అల్లు అర్జున్ ఫ్యామిలీ..., ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌.. వ‌రుణ్‌తేజ్‌... అల్లు అర్జున్ .. రామ్ చరణ్..  శిరీష్‌ అలాగే రితు వర్మ.. లావణ్య త్రిపాఠి కూడా హాజరయ్యారు.

ఆగస్టులో నిహారిక- చైత‌న్య‌ల నిశ్చితార్థం జ‌రిగింది. డిసెంబ‌ర్ ‌లో వివాహం జ‌రుగుతుంద‌ని అప్పుడే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వెల్ల‌డించారు. చెప్పిన‌ట్టే డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్ ‌లోని ఉద‌య్ పూర్ ఉద‌య్ విలాస్ ‌లో అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. పెళ్లి రోజున నిహారిక బంగారు వ‌ర్ణం కంజీవ‌రం చీర‌లో అత్యంత ఖ‌రీదైన ఆభ‌ర‌ణాల‌ని ధ‌రించి మెరిసిపోయింది. 
Tags:    

Similar News