మ‌ళ్లీ బాలీవుడ్ వెళుతున్న ఇస్మార్ట్ బ్యూటీ!

Update: 2020-12-03 07:15 GMT
నిధి అగ‌ర్వాల్‌. ప‌క్కా హైద‌రాబాదీ మార్వాడీ ఫ్యామిలీ గాళ్‌. అయితే పుట్టింది హైద‌రాబాద్ ‌లో అయినా పెరిగింది మాత్రం బెంగ‌ళూరులో. ఐశ్వ‌ర్యారాయ్ ఇన్సిస్పిరేష‌న్‌తో సినిమాల్లోకి రావాల‌ని బ‌లంగా కోరుకుంది. ఆ కోరిక‌తో టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా న‌టించిన `మున్నా మైఖేల్` చిత్రంతో హీరోయిన్ ‌గా ఎంట్రీ ఇచ్చి త‌న క‌ల‌ని నిజం చేసుకుంది. ఈ మూవీ కోసం మొత్తం 300 మందిని ఆడిష‌న్ చేస్తే అందులో ఫైన‌ల్ ‌గా నిధి అగ‌ర్వాల్‌ ని అదృష్టం వ‌రించింది.

ఈ మూవీ 2017లో విడుద‌లైంది. ఆ త‌రువాత బాలీవుడ్ ని వ‌దిలేసి టాలీవుడ్ బాట‌ప‌ట్టింది నిధి అగ‌ర్వాల్‌. స‌వ్య‌సాచి, మిస్ట‌ర్ మ‌జ్న చిత్రాల్లో న‌టించింది. కానీ నిధికి `ఇస్మార్ట్ శంక‌ర్` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ ని అందించింది. ప్ర‌స్తుతం త‌మిళంలో శింబుతో ఓ ఫిల్మ్ చేస్తున్న నిధి తెలుగులో మ‌హేష్ మేన‌ల్లుడు గ‌ల్లా అశోక్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రంలో న‌టిస్తోంది. తెలుగు, .త‌మిళ భాష‌ల్లో బిజీగా వున్నా మ‌ళ్లీ బాలీవుడ్ బాట ప‌ట్టాల‌నుకుంటోంది.

మూడేళ్ల విరామం త‌రువాత  బాలీవుడ్ ‌లో నిధి క్రేజీ ఆఫ‌ర్ ‌ని ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం చేస్తున్న తెలుగు, త‌మిళ చిత్రాలు పూర్తి చేసిన త‌రువాత హిందీ చిత్రం కోసం బాలీవుడ్ బాట ప‌ట్ట‌బోతోంది. ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్న వివ‌రాల్ని నిధి అగ‌ర్వాల్ త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నుంద‌ట‌.
Tags:    

Similar News