ఆమె బాధపడితే కాళ్లు పట్టుకోవడానికి సిద్ధం..!

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో చిన్న చిన్న విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.;

Update: 2026-04-24 17:31 GMT

ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో చిన్న చిన్న విషయాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరు ఇంటర్వ్యూల్లో చేస్తున్న కామెంట్స్‌ను పట్టుకుని సోషల్‌ మీడియాలో కొందరు తెగ రోస్ట్‌ చేస్తున్నారు. ఆ మధ్య మిల్కీ బ్యూటీ తమన్నాను గురించి ఒక సీనియర్‌ నటుడు అన్నూ కపూర్‌ చేసిన కామెంట్స్ వైరల్‌ అయ్యాయి. చాలా రోజుల క్రితం ఆ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తమన్నాను అన్నూ కపూర్‌ చాలా పెద్ద బూతు మాట అన్నాడు అన్నట్లుగా కొందరు సోషల్‌ మీడియాలో హడావిడి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు దాని గురించి పెద్దగా చర్చ లేదు. అంతా దాన్ని మర్చి పోయారు. కానీ ఆ సమయంలో అన్నూ కపూర్ చాలా ఇబ్బంది పడ్డాడట. తమన్నా తాను చేసిన వ్యాఖ్యలను నిజంగానే తప్పుగా అర్థం చేసుకుందా ఏంటో అని ఆందోళన సైతం వ్యక్తం చేశాడట.

అన్నూ కపూర్‌ వ్యాఖ్యలపై క్లారిటీ...

తాజాగా ఈ విషయమై అన్నూ కపూర్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను చేసిన వ్యాఖ్యలను ఆ సమయంలో కొందరు తీవ్రంగా ట్రోల్‌ చేయడం బాధను కలిగించిందని అన్నాడు. నేను హిందీలో తమన్నా అందంను పొగడడం వల్లే తప్పు జరిగినట్లుగా చాలా మంది ట్రోల్‌ చేశారు. అదే నేను ఇంగ్లీష్ లో అందంగా ఉందని చెప్తే ఏ ఒక్కరూ తప్పుగా అనే వారు కాదు. భాష మారిందే తప్ప, తన ఉద్దేశం మారలేదు అన్నాడు. ఒకవేళ తమన్నా నా వ్యాఖ్యలకు బాధపడినట్లు తెలిస్తే ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పేందుకు సైతం రెడీ అన్నట్లుగా అన్నూ కపూర్‌ చెప్పుకొచ్చాడు. తాను తప్పుడు ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఆమె అందం గురించి మాత్రమే మాట్లాడాను, హిందీలో ఆ వ్యాఖ్యలు చేయడం వల్లే ఇబ్బంది వచ్చింది అన్నట్లుగా అన్నూ కపూర్‌ అప్పటి విషయాన్ని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

తమన్నా తప్పుబడితే దేనికైనా సిద్ధం...

సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాదాలను ఎదుర్కోవడం కొత్తేం కాదు. గతంలోనూ కొందరు చేసిన వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో రోస్ట్‌ చేయడం జరిగింది. అయితే అన్నూ కపూర్ వయసు రీత్యా ఆయన తమన్నా గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అన్నూ కపూర్‌ వయసుకు ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లుగా చాలా మంది ట్రోల్‌ చేశారు. కూతురు వయసు, అంతకంటే చిన్న వయసులో ఉండే తమన్నాను పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు అంటూ ఆయన్ను చాలా మంది గట్టిగానే ట్రోల్‌ చేశారు. వయసు మీద పడ్డ మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదంటూ చాలా మంది ఆయన్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందికి గురి చేశాయట. అందుకే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

బాలీవుడ్‌ మీడియాలో రచ్చ...

తప్పుడు ఉద్దేశం లేకుండా తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి, తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేశారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తమన్నా మాత్రం ఈ విషయమై పెద్దగా స్పందించలేదు. తమన్నా ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోదు. గతంలోనూ ఇలాంటివి కొన్ని సోషల్‌ మీడియాలో ఆమె గురించి తెగ ప్రచారం జరిగాయి. కానీ ఆమె మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే అన్నూ కపూర్ వ్యాఖ్యలను ఆమె ఎలా తీసుకుంది అనే విషయాన్ని మాత్రం ఆమె స్వయంగా స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. స్వయంగా అన్నూ కపూర్‌ స్పందిస్తూ తమన్నా బాధపడితే కాళ్లు పట్టుకునేందుకు సిద్ధం అన్నాడు కనుక ఆమె ఈ విషయాన్ని గురించి పెద్దగా ఇకపై కూడా స్పందించక పోవచ్చు.

Tags:    

Similar News