అబ్బ.. ఆ పనంటే ఎంతిష్టమో! వెంటనే వాలిపోయా: ఇస్మార్ట్ హీరోయిన్
కొత్త బట్టలు కొనడమంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. నాకైతే షాపింగ్ చేయడం చాలా చాలా ఇష్టం. కరోనా వల్ల షాపింగ్ చాలా మిస్సయ్యాను. లాక్ డౌన్ తర్వాత దుకాణాలు ఓపెన్ అవుతుండడంతో షాపింగ్ చేస్తున్నా. చాలా షాపింగ్ చేసేయాలనుంది’’ అంటోంది ‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నిధి అగర్వాల్.
కరోనా కారణంగా ఏడాది మొత్తం ఇంటికే పరిమితమయ్యారు కదా.. ఈ ఏడాదిలో ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారామె. ‘‘గత ఏడాది షూటింగ్ చేయడం మిస్ అయ్యా. అందుకే ఈ ఇయర్ ఎక్కువ పని చేయాలనుంది. అంతేకాకుండా.. ఫ్రెండ్స్‌తో కలసి బయటకు వెళ్లాలి. నాకు ఇష్టమైన షాపింగ్ ఫుల్లుగా చేసేయాలి.’’ అని అన్నారు.
ఆన్‌లైన్ షాపింగ్ చేసీ చేసీ బోర్ కొట్టేసిందన్న నిధి అగర్వాల్.. స్టోర్స్ అన్నీ ఓపెన్ కాగానే రెక్కలు కట్టుకుని వాలిపోవాలనిపించిందని చెప్పింది. లాక్‌డౌన్ ముగియడంతో ఇప్పుడు హ్యాపీగా షాపింగ్ చేస్తున్నా అని చెప్పారు. కొత్త బట్టలు కొనుక్కుంటే భలే సంతోషంగా ఉంటుందని చెప్పింది నిధి.
కాగా.. ప్రస్తుతం తమిళ్ లో శింబు సరసన ఈ అమ్మడు నటించిన చిత్రం ‘ఈశ్వరన్’. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో అడుగు పెడుతోంది నిధి. మరి, అక్కడ తన ప్రయాణం ఏవిధంగా సాగుతుందో చూడాలి.