• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కొత్త హిట్ ఫార్ములా...

కొత్త హిట్ ఫార్ములా కనిపెట్టాశారోచ్...

By - Tupaki Desk
Update: 2016-03-01 13:30 GMT
హార్రర్ కామెడీ.. గత మూణ్నాలుగేళ్లుగా తెలుగు సినిమాను ఊపేసిన హిట్ ఫార్ములా. కానీ ఇప్పుడా ఫార్ములా మొహం మొత్తేసింది. ఈ సినిమాలన్నీ ఒక ఫార్మాట్ ప్రకారం వెళ్లిపోతుండటంతో జనాలకు ఆసక్తి తగ్గిపోయింది. ఇలాంటి టైంలో టాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్లకు గిరాకీ పెరుగుతోంది. ఈ జానర్లో వస్తున్న సినిమాలు వరుసగా విజయం సాధిస్తుండటంతో ఇదే ట్రెండుగా మారేలా కనిపిస్తోంది. రెండేళ్ల కిందట మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్‌ అయిన 'దృశ్యం' థ్రిల్లరే. మామూలుగా థ్రిల్లర్‌ మూవీస్‌ పై ఫ్యామిలీస్‌ పెద్దగా ఆసక్తి చూపించవు కానీ.. ఇది ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో నడిచే థ్రిల్లర్‌ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌ మాత్రమే కాదు.. అన్ని వర్గాల ప్రేక్షకులూ చూశారు. థ్రిల్లర్‌ సినిమాల్లో ఉండే మజా ఏంటో ఈ సినిమా చూపించింది.

ఇక సుధీర్‌ వర్మ రూపొందించిన 'స్వామిరారా' కూడా థ్రిల్లరే. ఇది కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. గత ఏడాది సుధీర్‌ బాబు హీరోగా కొత్త దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య రూపొందించిన 'భలే మంచి రోజు' కూడా మంచి ఆదరణ పొందింది. ఈ ఊపులో కొత్త ఏడాది ఇప్పటికే  మూడు థ్రిల్లర్‌ మూవీస్‌ వచ్చాయి. అవి ఆదరణ పొందాయి. రీసెంట్‌ గా వచ్చిన 'క్షణం' మూవీ తెలుగు సినిమా చరిత్రలోలోనే బెస్ట్‌ థ్రిల్లర్స్‌ లో ఒకటని చెప్పాలి. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు రిలీజైన శ్రీకాంత్‌ సినిమా 'టెర్రర్‌' కూడా మంచి థ్రిల్లర్‌ గా పేరు తెచ్చుకుంది. ఏ అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మౌత్‌ టాక్‌ తో జనాదరణ పెంచుకుంటోంది. మరోవైపు ఈ శుక్రవారం విడుదల కాబోయే.. మంచు మనోజ్ మూవీ 'శౌర్య' కూడా థ్రిల్లరే కావడం విశేషం. ఇలా మొత్తానికి టాలీవుడ్ లో థ్రిల్లర్‌ సినిమాలకు ఓ ఊపు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఊపులో మున్ముందు మరిన్ని  థ్రిల్లర్స్‌ తెరకెక్కే అవకాశాలున్నాయి.
Tags:    
  • Tollywood Movies 
  • Suspense Thriller 
  • Telugu News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS