తెలుగు తెర... కొత్త కళ..
దర్శకుడు ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాక హీరోయిన్ కోసం వెతకడానికి తెలుగులో బాగానే కష్టపడేవాడు. అనుష్క - సమంతా - త్రిష - తమన్నా - శృతిహాసన్ ల పారితోషికాలు ఆకాశాన్ని అందుతుండడంతో మినిమమ్ బడ్జెట్ లో సినిమాలు చెయ్యలేని పరిస్థితి. అలాంటి వారికి ఇప్పుడు తెలుగు తెరపై అరడజనుకు పైగా ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్లు వుండడం విశేషం. అటు హిట్ల పర్సెంట్ లోనూ, ఇటు నటనలోనూ వీరు ముందంజలో వుండడం విశేషం.
ఈ ఏడాది మొదట్లో నేను శైలజ సినిమా ద్వారా పరిచయమైన కీర్తి సురేష్ ఫ్రెష్ లుక్స్ తో ఆకట్టుకుంది. త్వరలోనే నానితో నటించబోయే ఒక సినిమాకు అప్పుడే ఆఫర్ అందుకున్నట్టు సమాచారం. ఇక గత ఏడాదే బీరువా సినిమాతో ఆకట్టుకున్న సురభి ఈ సంవత్సరం ఎక్స్ ప్రెస్ రాజా - జెంటిల్ మన్ సినిమాలతో విజయాన్ని అందుకుంది. భలే భలే మగాడివోయ్ సినిమాలో నటించిన లావణ్య త్రిపాటి వరుసపెట్టి ఆఫర్లు అందుకుంది. నాగ్ సరసన సోగ్గాడే చిన్ని నాయనలో మంచి నటన కనబరిచింది. ప్రస్తుతం అల్లు శిరీష్ - వరుణ్ తేజ్ ల సినిమాలలో నటిస్తుంది. ఇక రీసెంట్ గా తెరపై మెరిసిన నివేద థామస్ అయితే విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటూ భవిష్యత్ ని ప్లాన్ చేసుకుంటుంది.
వీరేకాక కుమారిగా అలరించిన హెబ్బా పటేల్ - ఎవడే సుబ్రహ్మణ్యం - కళ్యాణ వైభోగమే సినిమాలలో నటించిన మాళవిక నాయర్ - కృష్ణగాడి వీర ప్రేమగాధలో ప్రియురాలు మొహరీన్ - స్పీడున్నోడు కధానాయిక సోనారిక సైతం తమ నటనతో మెప్పిస్తూ అవకాశాలు సొంతం చేసుకునే క్రమంలో వున్నారు.