కొత్త సినిమాను లైన్లో పెట్టేసిన కొత్త పెళ్లి కూతురు!
వెన్నెల్లో చందమామను .. వెండితెరపై కత్రినా కైఫ్ ను ఎంతసేపైనా అలా చూస్తుండిపోవచ్చు. తెరపై ఆమెను చూస్తే పాలరాతి శిల్పానికి పాలతో ప్రాణాలు పోసినట్టుగా కనిపిస్తుంది. అజంతా శిల్ప సౌందర్యాలను చూడలేని వాళ్లు ఆమె సినిమాలకి వెళ్లవచ్చునని అనిపిస్తుంది. బాలీవుడ్ తెరపై భారీగా సందడి చేసే ఆమెను అభిమానించనివారు .. ఆరాధించనివారు ఉండరేమో. అలాంటి ఈ సౌందర్యరాశి ఇటీవలే విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి సంబరాల్లో నుంచి ఆమె బయటపడి, సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పట్టొచ్చని అంతా అనుకున్నారు.
కానీ ఆమె త్వరలో తన సినిమా సెట్స్ పైకి వెళుతున్నట్టుగా ఒక అప్ డేట్ వదిలేసింది. ఈ విషయంలో కత్రినాకు .. నయనతారకి చాలా దగ్గర పోలిక కనిపిస్తుంది. ఇతర వ్యవహారాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, తమ కెరియక్ర్ ను మాత్రం నిర్లక్ష్యం చేయరు. తమ సినిమాల మధ్య గ్యాప్ రానీయరు. ఎలాంటి విసుగు లేకుండా ఒక సినిమా తరువాత ఒక సినిమాను చేస్తూ వెళుతూనే ఉంటారు. అది కూడా ఎంతో అంకితభావంతో. అందువల్లనే పెళ్లి వేడుకలు ముగిసిన చాలా తక్కువ సమయంలోనే కత్రినా మళ్లీ తన సినిమాలపై ఫోకస్ చేస్తోంది.
దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తో కలిసి పని చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాను. ఆయనతో కలిసి 'మెర్రీ క్రిస్మస్' చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. థ్రిల్లర్ సినిమాలు చేయడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి ఆయనతో కలిసి వర్క్ చేసే రావడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. రమేశ్ తరాని నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి నటించే సమయం కోసం చాలా ఆత్రుతగా ఉన్నాను" అంటూ ఈ సినిమా టీమ్ తో దిగిన ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా నిడివి కేవలం 90 నిమిషాలు మాత్రమే అనే ఒక టాక్ వినిపిస్తోంది.
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల జాబితాలో 'ఏక్ హసీనా థీ' .. 'ఏజెంట్ వినోద్' .. 'బద్లాపూర్' .. 'అంధాదున్' మొదలైనవి కనిపిస్తాయి. సస్పెన్స్ తో కథలను నడిపించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయన టేకింగ్ ను ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఆయన సినిమాల్లో చేసే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన బాలీవుడ్ కి .. కోలీవుడ్ కి ముడిపెడుతూ ఈ కాంబినేషన్ ను సెట్ చేశాడు. ఈ కాంబినేషన్ చూస్తుంటే ఇందులో కథనే ప్రధానమైనదనే విషయం అర్థమవుతోంది. 'మెర్రీ క్రిస్మస్' ఎలాంటి విశేషాలకు వేదికగా నిలుస్తుందో చూడాలి మరి.