కూలీ నెం.1... మా బోయపాటిని మించావుగా బాసూ
వరుణ్ ధావన్ హీరోగా సారా అలీ ఖాన్ హీరోయిన్ గా డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందిన 'కూలీ నెం.1' సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ విషయంలో ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. 1995లో వచ్చిన కూలీ నెం.1 కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. ఆ సమయంలో ప్రేక్షకులకు ఇప్పుడు ప్రేక్షకులకు చాలా తేడా ఉంది. ఆ విషయాన్ని డేవిడ్ ధావన్ మర్చిపోయినట్లుగా ఉన్నాడు. యాక్షన్ సీన్స్ విషయంలో పాత చింతకాయ పచ్చడి తీరును అవలంభించాడు. దాంతో ఆయన పై దారుణమైన ట్రోల్స్ పడుతున్నాయి.
ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో పిల్లాడిని కాపాడే సీన్ మరీ ఓవర్ అయ్యిందంటున్నారు. పరిగెత్తుతూ ఉన్న రైలు మీద నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి వెంట్రుక వాసిలో బాబును రైలు కింద పడకుండా కాపాడాడు. ఈ సీన్ ను చూస్తుంటే తెలుగు ప్రేక్షకులకు వినయ విధేయ రామ సినిమా సీన్ గుర్తుకు వచ్చినట్లుగా ఉంది. వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ తో బోయపాటి చేయించిన ఫీట్స్ అన్నీ ఇన్నీ కావు. వాటికి సోషల్ మీడియాలో పడ్డ అక్షింతలు కూడా అన్ని ఇన్నీ కావు. ఇలాంటి సమయంలో కూలీ నెం.1 సినిమా సీన్ విషయంలో కూడా ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. డేవిడ్ ధావన్ ను తెలుగు ప్రేక్షకులు మా బోయపాటిని మించావుగా అంటూ ట్రోల్ చేస్తున్నారు.