డబ్బు పిచ్చితో జనాల్ని బలి పెడతారా?
కరోనా కొత్త వేరియంట్ విజృంభణతో ఢిల్లీ లో థియేటర్లు మూసివేసిన సంగతి తెలిసిందే. ఇంకా పలు రాష్ట్రాల్లో మెట్రో నగరాల్లో థియేటర్ల క్లోజింగ్ కి రంగం సిద్ధమవుతోంది. వీలైనంత వరకూ కొత్త వేరియంట్ భారిన పడకుండా అంతా జాగ్రత్తగా తీసుకోవాలని కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అయితే ఇలాంటి సమయంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ మూసివేసిన థియేటర్లు తెరవాలంటూ ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేసారు. మిగతా ప్రదేశాలతో పోలిస్తే థియేటర్లలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. వ్యాప్లి లేకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..శానిటైజేషన్ చేసుకుంటే ఎలాంటి వైరస్ లు దరిచేరవని సలహాలిచ్చారు.
అలాగే ఇలాంటి సమయంలో కరణ్ జోహార్ బాలీవుడ్ సెలబ్రిటీలకు ఓ పార్టీ ఇచ్చారు. దీంతో నెటిజనులు కరణ్ పై భగ్గుమన్నారు. మీ ట్వీట్ ఉద్ధేశం ఏంటి? ``మమ్మల్ని డబ్బు సంపాదించుకోనివ్వండి. మీరు ఎలా పోయినా పర్వాలేదు అనేగా!`` అంటూ నిర్మాతపై ఎటాక్ కి దిగారు. `బాలీవుడ్ వర్సెస్ సైన్స్` అంటూ వెక్కిరిస్తున్నారు. సినిమాల రిలీజ్ కి ఓటీటీ ఉందిగా..అందులో రిలీజ్ చేసుకుని బ్రతకండి. అంతేగాని ఇలా సామాన్యుల ప్రాణాలతో చెలగాటం వద్దు` అంటూ మరికొంత మంది కరణ్ ట్వీట్ పై నిప్పులు చెరిగారు. కరణ్ ఫోటోల్ని సోషల్ మీడియాలో జోరుగా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ట్రోలింగ్ కి గురవ్వడం కరణ్ కి కొత్తేం కాదు.
గతంలో చాలాసార్లు వివాదాస్పద అంశాల్లో తలదూర్చి అక్షింతలు వేయించుకున్న సందర్భాలున్నాయి. వాటిని అంతే లైట్ తీసుకోవడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం ఆయన నిర్మాతగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్ హౌస్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు. అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ తో నే రెండు..మూడు ప్రాజెక్ట్ కలు సైన్ చేయించారు.