బ్లాక్ అవుట్ ఫిట్ లో హీట్ పుట్టిస్తున్న దిశాపటాని!

అసలే సమ్మర్ పైగా బ్లాక్ డ్రెస్ ధరించి సెగలు పుట్టించే గ్లామర్ వలకబోస్తూ దిశాపటాని షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి.;

Update: 2026-04-06 08:12 GMT

అవకాశాలతో పని లేకుండా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని పెంపొందించుకుంటూ తమ అందంతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటున్న హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా కొంతమంది యూట్యూబ్ ద్వారా ఆదాయాన్ని ఘడిస్తుంటే.. మరికొంతమంది ఇలా ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా అందాలు ఆరబోస్తూ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. అంతేకాదు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా ఊహించని క్రేజ్ అందుకుంటున్న విషయం తెలిసిందే.



 


ఇకపోతే కొంతమంది వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరొకవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి గ్లామర్ వలకబోస్తూ సోషల్ మీడియాను పునాదిగా వేసుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని కూడా ఒకరు. ప్లేస్ తో సంబంధం లేకుండా గ్లామర్ వలకబోయడమే ప్రధానంగా చేసుకుంటూ అందంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులలో హీట్ పెంచే ప్రయత్నం చేసింది. అసలే సమ్మర్ పైగా బ్లాక్ డ్రెస్ ధరించి సెగలు పుట్టించే గ్లామర్ వలకబోస్తూ దిశాపటాని షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి.



 


దిశాపటాని బాలీవుడ్ నటి అయినప్పటికీ అవకాశం లభించింది మాత్రం తెలుగులోనే.. తొలిసారి లోఫర్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టింది.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మౌని అనే పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది. అటు బాలీవుడ్ లో ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసి మొదటి సినిమాతోనే అక్కడ ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ మాత్రమే కాదు 2017లో చైనీస్ భాషలో సినిమా చేసి అలరించిన దిశాపటాని ఇక హిందీలోనే సినిమాలు చేస్తూ వచ్చింది.



 


అటు సినిమాలతో పాటు ఇటు మ్యూజిక్ వీడియోస్ లో కూడా కనిపించిన ఈ ముద్దుగుమ్మ .. తన చిత్రాలతో పలు అవార్డులను కూడా దక్కించుకుంది దిశా పటాని. ఇకపోతే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలను పంచుకునే దిశా పటాని గతంలో తన ఫస్ట్ క్రష్ గురించి కూడా చెప్పుకు వచ్చింది. దిశా పటాన్ని మాట్లాడుతూ.. నేను స్కూల్లో ఉన్నప్పుడు రణబీర్ కు పెద్ద అభిమానిని. ఆయన పోస్టర్ చూస్తూ ఎన్నోసార్లు ప్రమాదంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది ..మా నగరంలో ఆయనకు సంబంధించిన పెద్ద పెద్ద పోస్టర్లు ఉండేవి ఇక ఆయనను చూస్తూ అలా ఉండిపోయేదాన్ని అంటూ దిశాపటాని తెలిపింది.



 


దిశాపటాని ఇటు సినిమాలతోనే కాదు అటు వ్యక్తిగతంగా కూడా రూమర్స్ ఎదుర్కొంటోంది. తల్విందర్ తో ఈమె ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు జనవరి 25న ఈ లోలాపలుజా ఇండియా 2026లో తల్విందర్ చేతులు పట్టుకొని మరి బయటకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది . ఏది ఏమైనా దిశా పటాని ఇలా వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలతో వార్తల్లో నిలుస్తోంది.

Tags:    

Similar News