వీడియో : జిమ్‌ లో లేడీ 'చిరుత' అందాల ప్రదర్శణ

Update: 2020-11-10 04:00 GMT
కరోనా కారణంగా చాలా నెలలుగా జిమ్ లు అన్ని కూడా మూత బడి ఉన్నాయి. దాంతో సెలబ్రటీలు దాదాపు అంతా కూడా జిమ్‌ సెంటర్‌ లు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. రెగ్యులర్ గా జిమ్‌ లు చేసే వారు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి తింటూ కూర్చోవడంతో కాస్త లావు అయ్యారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జిమ్‌ సెంటర్ల రీ ఓపెన్‌ కు ఓకే చెప్పడంతో ఫేమస్‌ జిమ్‌ సెంటర్లు రీ ఓపెన్ అయ్యాయి. పెద్ద స్టార్స్‌ కు హోమ్‌ జిమ్‌ లు ఉన్నా చిన్న స్టార్స్ కు జిమ్‌ కష్టం అయ్యింది. దాంతో ఇన్ని రోజులుగా ముద్దుగుమ్మల జిమ్‌ వీడియోలు నెటిజన్స్‌ మిస్‌ అయ్యారు. జిమ్‌ సెంటర్‌ లు ఓపెన్‌ చేయడంతో మళ్లీ నెట్టింట ముద్దుగుమ్మల వర్కౌట్‌ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. నేహా శర్మ తన జిమ్‌ వర్కౌట్‌ వీడియోను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

మెగా 'చిరుత' బ్యూటీ నేహా శర్మ 2007 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆసినిమా సక్సెస్‌ అయినా ఈ అమ్మడికి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. టాలీవుడ్‌ లో ఈ అమ్మడి జర్నీ కొంత కాలంకే ముగిసింది. ఉత్తరాదిన బిజీ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నంచిన ఈ అమ్మడు అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కించుకోలేక పోయింది. ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయినా కూడా మంచి ఫిజిక్‌ ను మెయింటెన్‌ చేస్తూ హీరోయిన్‌ పాత్రల కోసం ఈ అమ్మడు వెయిట్‌ చేస్తోంది.

ఎట్టకేలకు జిమ్‌ లు రీ ఓపెన్‌ చేయడంతో వర్కౌట్స్‌ చేస్తుంటే శరీరానికి చాలా అహ్లాదకరంగా ఉంది అంటూ కామెంట్‌ పెట్టి వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోలో ఈ అమ్మడి అందాల ప్రదర్శణకు ఫాలోవర్స్‌ ఫిదా అవుతున్నారు. 10 గంటల లోపే ఏకంగా మిలియన్‌ లైక్స్‌ ఈ వీడియోకు వచ్చాయంటే ఈమె యాంగిల్‌ మార్చి చూపించిన బ్యూటీకి ఎంతగా జనాలు పడిపోయారో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News