చిరుత బ్యూటీ అందాల చితక్కొట్టుడు..!

Update: 2023-07-06 18:31 GMT
షైనింగ్ విత్ శర్మాస్ అంటూ లాస్ట్ ఇయర్ వెబ్ సీరీస్ తో రచ్చ చేసిన నేహా శర్మ రీసెంట్ గా జోగిరా సారా రారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా లో నవాజుద్ధీన్ సిద్ధిఖీ మేల్ లీడ్ గా నటించగా నేహా శర్మ ఫీమేల్ లీడ్ గా నటించారు. మే నెలలో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే సినిమా ఫలితా లతో సంబంధం లేకుండా నేహా శర్మ తన గ్లామర్ ట్రీట్ అందిస్తుంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ చిరుత సినిమా తో అతని తో కలిసి నటించిన నేహా శర్మ ఇప్పటికీ తన గ్లామర్ తో ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తుంది. అమ్మడు ఫోటో షూట్ కోసం ఫాలోవర్స్ అంతా కూడా ఎదురుచూసేలా చేసుకుంది. నేహా శర్మ గ్లామర్ షో చేస్తే అది వైరల్ అవ్వాల్సిందే అన్నంతగా పాపులారిటీ తెచ్చుకుంది అమ్మడు. చిరుత, కుర్రాడు సినిమా లతో తెలుగు ఆడియన్స్ కు పరిచయం ఉండటంతో మన వాళ్లు కూడా నేహా శర్మ ని ఫాలో అవుతున్నారు.

కెరీర్ సంగతి ఎలా ఉన్నా ఫోటో షూట్స్ మీద ఫోకస్ అంతా పెట్టింది నేహా శర్మ. అందుకే రోజుకొక కొత్త ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. లేటెస్ట్ గా అమ్మడు బ్లాక్ అండ్ బోల్డ్ ఫోటో షూట్ తో తన ఫాలోవర్స్ కి హాట్ ట్రీట్ అందించింది. ఫోటో షూట్స్ విషయం లో నేహా శర్మ నెక్స్ట్ లెవెల్ జోష్ కనిపిస్తుంది. లేటెస్ట్ గా బ్లాక్ డ్రెస్ లో ఆడియన్స్ ని తన పరువాల వల లో చిక్కుకునేలా చేస్తుంది అమ్మడు.

ఈమధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు లో మళ్లీ ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా అంటుంది నేహా శర్మ. అందాల ప్రదర్శన లో తన తర్వాతే ఎవరైనా అన్న రేంజ్ లో నేహా గ్లామర్ షో ఉంటుంది. ఎలాంటి పాత్రకైనా సిద్ధమే అంటూ అమ్మడు హింట్ ఇస్తున్నా అవకాశాలు మాత్రం రావట్లేదని చెప్పొచ్చు. ఇంతగా ఫోటో షూట్స్ చేస్తున్న నేహా శర్మ కష్టాన్ని ఏ డైరెక్టర్ అయినా గుర్తిస్తాడేమో చూడాలి. బాలీవుడ్ లో కూడా ఆశించిన స్థాయి లో కెరీర్ లేకపోయినా ఫోటో షూట్స్ చేస్తూ ఫాం కొనసాగిస్తుంది అమ్మడు. సినిమాల కన్నా ఇలా ఫోటో షూట్స్ తోనే ఫాలోవర్స్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంటుంది నేహా శర్మ. ఇన్ స్టా ద్వారా అమ్మడు బాగానే సంపాదిస్తుందని అంటున్నారు.

Similar News