టాలెంటెడ్ హీరోకి మళ్ళీ ఎదురుదెబ్బ..!
కెరీర్ ఆరంభంలో చిన్న పాత్రల్లో మెప్పించిన టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్.. 'జ్యోతిలక్ష్మి' 'అంతరిక్షం' 'ఘాజీ' 'ఇస్మార్ట్ శంకర్' 'బ్రోచేవారెవరు రా' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'బ్లఫ్ మాస్టర్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాలతో హీరోగా నిలదొక్కుకున్నాడు. వెబ్ వరల్డ్ లో కూడా అడుగుపెట్టిన సత్యదేవ్.. 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' 'లాక్డ్' వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించాడు. కరోనా కారణంగా ఈ ఏడాది స్టార్ హీరోలందరూ సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో ఓటీటీ వేదికగా '47 డేస్' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి రెండు సినిమాలను విడుదల చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. అందులో ఒకటి ప్లాప్ టాక్ తెచ్చుకోగా మరొకటి సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ క్రమంలో సత్యదేవ్ ఓటీటీ స్టార్ హీరోగా మారిపోయాడనే కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన 'గువ్వ గోరింక' వల్ల సత్యదేవ్ కి ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు.
సత్యదేవ్ హీరోగా నటించిన 'గువ్వ గోరింక' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. మోహన్ బమ్మిడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం పూర్తైన ఈ సినిమా ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏమాత్రం మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ఫలితాన్ని సత్యదేవ్ లైట్ తీసుకున్నప్పటికీ 'గువ్వ గోరింక' ఫ్లాప్ క్రెడిట్ మాత్రం సత్యదేవ్ కే అంటగట్టేస్తున్నారు. దీని కారణంగా సక్సెస్ రేట్ తగ్గిపోవడమే కాకుండా సత్యదేవ్ ఓటీటీ మార్కెట్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ఇలానే మరో రెండు ఫ్లాపులు గనుక సత్యదేవ్ కి వస్తే అతని కెరీర్ ఇబ్బందుల్లో పడే పరిస్థితి రావచ్చని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాగా, సత్యదేవ్ ప్రస్తుతం 'తిమ్మరుసు' అనే సినిమాలో నటిస్తున్నాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై మహేష్ కోనేరు - సృజన్ ఎరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సత్యదేవ్ సరసన 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తోంది. అలానే మిల్కీ బ్యూటీ తమన్నా తో కలిసి సత్యదేవ్ 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో నటిస్తున్నాడు.