బ్లాక్ బటన్ ఉందిగా అంటున్న సన్నీ

Update: 2017-03-22 07:08 GMT
గత ఐదేళ్ళుగా బాలీవుడ్ ను ఉర్రూతలూగిస్తున్న మాజీ పోర్న్ స్టార్ సన్ని లియోన్.. ఇప్పుడు 35 ఏళ్ల వయస్సులో కూడా హాటు హాటుగా ఊరిస్తూ సినిమా ఇండస్ర్టీలో ఒక రేంజులో దూసుకుపోవడానికి తన అభిమానగణమే కారణం అంటోంది. వారు తనని ఆదరిస్తున్నంత కాలం.. తనకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని.. వారి కోసం ఏమైనా చేస్తానని చెబుతోంది ఈ అమ్మడు.

మొన్ననే రయీస్ సినిమాలో షారూఖ్‌ ఖాన్ సరసన ఒక ఐటెం సాంగ్ కూడా చేసిన సన్నీ.. నెగెటివిటీకి దూరంగా ఉండటం వలనే తను ఇండస్ర్టీలో ఇలా నెట్టుకొస్తున్నానంటోంది. ''నిజానికి ట్విట్టర్లో నాకు చాలామంది అభిమానులు ఉన్నారు. వారు ఎప్పుడూ నన్నే సపోర్టు చేస్తూ ఉంటారు. అందుకే నేను అనవసరమైన అసహ్యపు క్రిటిసిజం పట్టించుకోకుండా చక్కగా పనిలో దూసుకుపోతున్నాను. ఇక వేధించేవారికోసం బ్లాక్ బటన్ ఉంది కదా. వెంటనే వాని బ్లాక్ చేసిపాడేస్తే చాలు'' అంటూ ఓ నవ్వు నవ్వేసింది సన్నీ.

మొత్తానికి అప్పట్లో ఒక పెద్ద మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టు కూడా సన్నీ లియోన్ ను లైవ్ లోనే నువ్వో పోర్న్  స్టార్ వి కదా సిగ్గుగా లేదా అంటూ సూటిగా ప్రశ్నించినా కూడా.. అమ్మడు వణకకుండా తొణకకుండా అద్బుతమైన సమాధానాలు చెప్పింది. ఇప్పుడు కూడా అదే దోరణిలో అదరగొట్టేసింది. సో బ్లాక్ బట్టన్ నొక్కించుకుంటారో సన్ని అందాలను వివిధ బ్లాకుల్లో చూసి ఎంజాయ్ చేస్తారో మీ ఇష్టం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News