ఆనంద్ 'గం గం గణేశా'.. రిలీజ్ ఎప్పుడంటే?

ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తుండగా.. నయన్ సారిక కీలక పాత్ర పోషిస్తోంది.

Update: 2024-04-29 11:43 GMT

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ.. గత ఏడాది బేబీ సినిమాతో ఎలాంటి హిట్ కొట్టారో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆనంద్.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నారు. అందులో 'గం గం గణేశా' ఒకటి. కొత్త డైరెక్టర్ ఉదయ్ శెట్టి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయికగా నటిస్తుండగా.. నయన్ సారిక కీలక పాత్ర పోషిస్తోంది.


ఈ క్రైమ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ 'బృందావనివే' మంచి రెస్పాన్స్ అందుకుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే సూపర్ ట్రాక్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత కిక్ ఇచ్చే ఫన్ లోడింగ్ అంటూ సినిమా పాత్రలు ఎలా ఉండబోతాయో డిజైన్ చేసిన మోషన్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. అయితే చాలా రోజుల తర్వాత రీసెంట్ గా సోషల్ అప్డేట్ లో ఇచ్చారు ఆనంద్ దేవరకొండ.

"క్రైమ్ కామెడీ డ్రామా కోసం మేం కొన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్నాం. మేకింగ్‌లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. కానీ వాళ్ళు చెప్పినట్లు అంతా సవ్యంగా ముగుస్తుంది. మూవీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. కామెడీ, డ్రామా వినూత్న రీతిలో హ్యాండిల్‌ చేశాం" అని నిన్ననే ట్వీట్ చేశారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఆయన చెప్పినట్లే నేడు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.

మే 31వ తేదీన 'గం గం గణేశా' రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కామెడీ, గందరగోళం, కన్ఫ్యూజన్ అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ దేవరకొండ పోస్టర్ కూడా షేర్ చేశారు. అందులో ఓ రాయిపై నిల్చున్న ఆనంద్.. గన్ తో షూట్ చేస్తున్నారు. అందులో నుంచి గులాబీ రెక్కలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ గా మారగా.. 'గం గం గణేశా' మూవీ వెరైటీగా ఉండనున్నట్లు తెలుస్తోందని అంటున్నారు.

ఈ సినిమాను హై- లైఫ్‌ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, సత్యం రాజేష్, జబర్దస్త్ ఇమ్మానుయేల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీతో పాటు డ్యూయెట్ సినిమా కూడా చేస్తున్నారు ఆనంద్. మరి దేవరకొండ బ్రదర్ కొత్త సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

Tags:    

Similar News