ఈవారం ఓటీటీ వినోదాల విందు జాబితా

థియేట్రికల్‌ రిలీజ్ తో పోల్చితో ఓటీటీ స్ట్రీమింగ్‌ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ ల విషయంలోనే ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు.

Update: 2024-04-29 12:23 GMT

ప్రముఖ ఓటీటీలు అన్నీ కూడా ప్రతి శుక్రవారం తమ వినియోగదారులకు కొత్త కొత్త కంటెంట్‌ ను ఇచ్చేందుకు పోటీ పడుతున్నాయి. థియేట్రికల్‌ రిలీజ్ తో పోల్చితో ఓటీటీ స్ట్రీమింగ్‌ సినిమాలు మరియు వెబ్‌ సిరీస్ ల విషయంలోనే ప్రేక్షకులు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు.

తెలుగు ప్రేక్షకులు చాలా రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యూత్‌ ఫుల్‌ చిత్రం మంజుమ్మెల్ బాయ్స్‌. మలయాళంకు చెందిన ఈ సినిమా ను తెలుగు లో డబ్‌ చేశారు. థియేట్రికల్‌ రిలీజ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ మలయాళ బ్లాక్‌బస్టర్‌ ఈ ఏడాది మేటి సినిమాల్లో ఒకటిగా నిలిచిన విషయం తెల్సిందే. ఎట్టకేలకు ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో మే 5 నుంచి స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. ఖచ్చితంగా ఓటీటీ లో ఈ సినిమా ఘన విజయం సాధించడం ఖాయం.

బాలీవుడ్‌ హర్రర్ థ్రిల్లర్ సైతాన్ కూడా మోస్ట్‌ వాంటెడ్‌ ఓటీటీ మూవీ అనడంలో సందేహం లేదు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రభావం చూపించింది. మే 3న ఈ సినిమాను నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

ఇంగ్లీష్ ఫాంటసీ కామెడీ వోంకా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కామెడీ థ్రిల్లర్‌ ను మే 3 నుంచి జియో సినిమా లో స్ట్రీమింగ్‌ చేయవచ్చు.

మే 2 న 'ది ఐడియా ఆఫ్‌ యు' అనే రొమాంటిక్ డ్రామా అమెజాన్ ప్రైమ్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.

హాలీవుడ్‌ స్టార్స్‌ నటించిన మేడమ్‌ వెబ్‌ ను మే 16న ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

Tags:    

Similar News