• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దర్శకుడిగా రాపిడో...

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

| వెంకీ కుడుముల నిర్మాతగా తెరకెక్కించిన ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న విడుదల కానుంది. ఒకప్పుడు రాపిడో డ్రైవర్‌గా పనిచేసిన మహేష్ ఉప్పలకు దర్శకుడిగా అవకాశం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కొత్త హీరో అనీష్ మూగవాడి పాత్రలో నటించగా, డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేశాడని వెల్లడించారు. నాగార్జున సమర్పిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేయగా, అనీష్ నటనను ప్రశంసించారు. సినిమాలో లవ్ స్టోరీతో పాటు యాక్షన్‌కు ప్రాధాన్యం ఉంటుందని వెంకీ చెప్పారు.

By - M Prashanth
Update: 2026-11-08 05:48 GMT

దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తున్న వెంకీ కుడుముల ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. తన సొంత బ్యానర్ వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై 'ఇట్లు అర్జున' సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా కోసం ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కొత్త హీరో, కొత్త దర్శకుడితో సినిమా చేయడమే కాకుండా ఒకప్పుడు రాపిడో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తికి దర్శకత్వ అవకాశం ఇచ్చారు. నవంబర్ 13న విడుదల కానున్న ఈ సినిమా గురించి వెంకీ కుడుముల విలేకరుల సమావేశంలో పలు విషయాలు షేర్ చేసుకున్నారు.

దర్శకుడు మహేష్ ఉప్పల గతంలో ఓ వెబ్ సిరీస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత మరో అవకాశం రావడానికి సమయం పట్టడంతో మధ్యలో రాపిడో డ్రైవర్‌గా కూడా పనిచేశారట. ఈ విషయం విన్న వెంకీ కుడుముల ఆయనకు అవకాశం ఇవ్వాలనుకున్నారు. మహేష్ చెప్పిన కథ కూడా నచ్చడంతో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. తనకు కూడా ఒకరు అవకాశం ఇవ్వడం వల్లే దర్శకుడిగా ఎదిగానని, అందుకే కొత్తవాళ్లను ప్రోత్సహించాలనుకుంటున్నట్లు చెప్పారు. మంచి కథలతో వచ్చే కొత్త దర్శకులతో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరణ ఇచ్చారు.

ఇక హీరో అనీష్ గురించి మాట్లాడుతూ ఆయనతో తనకు చాలాకాలంగా పరిచయం ఉందన్నారు. తరచూ తన ఆఫీస్‌కు వచ్చి సినిమాల గురించి మాట్లాడేవారని చెప్పారు. నటన, డ్యాన్స్, యాక్షన్ కోసం అనీష్ రోజూ ఎంతో సమయం కేటాయిస్తారని తెలిపారు. ఈ సినిమాలో హీరో మూగవాడి పాత్ర కావడంతో కొత్త నటుడైతే ప్రేక్షకులకు మరింత కన్విన్సింగ్‌గా ఉంటుందని భావించారట. పైగా యాక్షన్ సన్నివేశాల్లో అనీష్ డూప్ లేకుండా స్వయంగా నటించారని వెల్లడించారు. భవిష్యత్తులో తన దర్శకత్వంలోనూ అనీష్‌తో సినిమా చేసే ఆలోచన ఉందన్నారు.

మరోవైపు ఈ చిత్రానికి నాగార్జున సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమా నిర్మాణం వరకు తనకు అవగాహన ఉన్నప్పటికీ విడుదల, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కొంత ఒత్తిడిగా అనిపించేవని వెంకీ చెప్పారు. నాగార్జున రావడంతో ఆ పనులు సులభమయ్యాయన్నారు. మొదట ఆయనకు గ్లింప్స్ చూపించి వాయిస్ ఓవర్ అడిగారట. విజువల్స్ నచ్చడంతో నాగార్జున వాయిస్ ఇచ్చారు. అంతేకాదు, ఈ చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్‌ను తన 'కింగ్ 100' కోసం కూడా తీసుకున్నారు. ఇప్పటికే పూర్తి సినిమా చూసిన నాగార్జున చిత్రబృందాన్ని అభినందించారని తెలిపారు.

'ఇట్లు అర్జున' ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌తో పాటు అనీష్ నటనను కూడా ఎన్టీఆర్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారని వెంకీ చెప్పారు. మాటలు లేకుండా మూగవాడి పాత్రలో నటించడం కష్టమని ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారట. హీరోయిన్ అనస్వర రాజన్‌కు కూడా కథ బాగా నచ్చిందన్నారు. ఇక సంగీతం కోసం తమన్‌ను ఎంచుకోవడానికి 'తొలిప్రేమ' సినిమా ఓ కారణమని చెప్పారు. ఆ సినిమా సంగీతం తనకు ఎంతో ఇష్టమని, 'ఇట్లు అర్జున'కు కూడా అలాంటి మ్యూజిక్ బ్రాండ్ కావాలనుకున్నట్లు వివరించారు.

ఈ సినిమాలో లవ్ స్టోరీతో పాటు యాక్షన్‌కు కూడా ప్రాధాన్యం ఉంటుందని వెంకీ తెలిపారు. అనీష్, అనస్వర మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని, ముఖ్యంగా ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయని చెప్పారు. తమన్ పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా అందించారని పేర్కొన్నారు. ఇక నిర్మాతగా పనిచేయడం వల్ల సినిమా కోసం ఒక్కో విభాగం ఎంత కష్టపడుతుందో మరింత దగ్గరగా తెలుసుకున్నానన్నారు. ముఖ్యంగా బడ్జెట్ ఎక్కడ వృథా అవుతుందో అర్థమవుతుందని, అందుకే ప్రతి దర్శకుడు కనీసం ఒక్క సినిమా అయినా నిర్మించాలని సూచించారు. ప్రస్తుతం తన తదుపరి దర్శకత్వ సినిమా కోసం ఓ కామెడీ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Tags:    
  • itluarjuna 
  • venkykudumula 
  • anish 
  • anaswara 
  • nagarjuna 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS