• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక...

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

| వరుస తెలుగు సినిమాలు ఆశించిన విజయాలు అందుకోకపోయినా శ్రీలీల కెరీర్ మాత్రం నెమ్మదించలేదు. తమిళంలో శివకార్తికేయన్, ధనుష్, రజనీకాంత్, అజిత్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పారితోషికం తగ్గిస్తే మరిన్ని అవకాశాలు వస్తాయని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద సినిమాల్లో ఒక్క హిట్ దక్కినా స్టార్ హీరోయిన్‌గా మళ్లీ బలపడే అవకాశం ఉంది.

By - Priya Chowdhary Nuthalapti
Update: 2026-11-08 05:46 GMT

సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఒక సినిమా హిట్ అయితే వరుస అవకాశాలు వస్తాయి. అదే కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే హీరోయిన్ శ్రీలీల విషయంలో మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. తెలుగులో ఆమె నటించిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా..అవకాశాల విషయంలో మాత్రం ఆమె వెనక్కి తగ్గడం లేదు.

శ్రీలీలకు తెలుగులో పెళ్లి సందడి సినిమా తర్వాత వచ్చిన ధమాకా సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా విజయం తర్వాత ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. తన అందం, డ్యాన్స్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో శ్రీలీలకు మంచి పేరు వచ్చింది. దీంతో అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశాలు దక్కాయి.

అయితే ఆ తర్వాత ఆమె నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలను అందుకోలేదు. వరుస పరాజయాలు ఎదురైనా.. ఆమె కెరీర్ మాత్రం ఆగిపోలేదు. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో కూడా అవకాశాలు అందుకుంటోంది.

శ్రీలీల ఇప్పటికే శివకార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైంది. అలాగే ధనుష్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న ఓం సినిమాలో కూడా భాగమైంది. ఈ సినిమాలో ఆమె రోజా అనే పాత్రలో కనిపించనుంది. ఇక రజనీకాంత్ నటిస్తున్న ధర్మన్ సినిమాలో కూడా శ్రీలీలకు అవకాశం వచ్చింది. కమల్ హాసన్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరోవైపు అజిత్ కుమార్ నటిస్తున్న డేర్‌డెవిల్ సినిమాలో కూడా ఆమె నటించబోతోంది. ఇలా తమిళంలో వరుసగా పెద్ద సినిమాలు చేస్తోంది.

ఇదిలా ఉంటే శ్రీలీల తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ, వాటి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పారితోషికం తగ్గితే నిర్మాతలకు కూడా ఆమెను సంప్రదించడం సులభమవుతుంది. దీంతో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీలీల కెరీర్ కీలక దశలో ఉంది. ఆమె నటిస్తున్న పెద్ద సినిమాల్లో ఒక్కటి మంచి విజయం సాధించినా మళ్లీ స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని బలపరుచుకునే అవకాశం ఉంది. రెమ్యూనరేషన్ ఎక్కువ ఉన్నప్పుడే అన్ని ఆఫర్లు తెచ్చుకున్న ఈ హీరోయిన్.. ఇక ఇప్పుడు తగ్గించుకుంటే ఈమె దూకుడు ఆ పేరు ఎలా అని అందరూ భావిస్తున్నారు.

Tags:    
  • sreeleela 
  • sreeleelamovies 
  • tollywood 
  • kollywood 
  • southindianactress 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS