• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తలైవి' సాంగ్: ఎంజీఆర్ -...

తలైవి' సాంగ్: ఎంజీఆర్ - జయలలితల ప్రేమ గీతం 'నీ కన్నుల్లో ఏమున్నదో'

By - Tupaki Desk
Update: 2021-08-30 10:29 GMT
జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ''తలైవి''. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎంజీఆర్ గా విలక్షణ నటుడు అరవింద స్వామి కనిపించనున్నారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో వాయిదా పడిన ఈ సినిమాని వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్ తాజాగా 'నీ కన్నుల్లో ఏమున్నదో' అనే సాంగ్ ని వదిలారు.

'నీ కన్నుల్లో ఏమున్నదో.. కళ్ళు కలిపేసి తెలుసుకో.. నీ గుండెల్లో ఏమున్నదో.. గుర్తు పట్టేసి కలుసుకో..' అంటూ సాగిన ఈ పాట అలరిస్తోంది. ఎమ్‌జీఆర్ - జయలలిత మధ్య (అరవిందస్వామి - కంగనా రనౌత్) వింటేజ్ లవ్ ని ఈ సాంగ్ లో చూపించారు. ఇది ఎమ్‌జీఆర్ - జయలలిత కలిసి చేస్తున్న సినిమా షూటింగ్‌ నేపథ్యంలో రూపొందింది. జీవీ ప్రకాష్ దీనికి ట్యూన్ సమకూర్చారు. భాస్కర భట్ల సాహిత్యం అందించగా.. నకుల్ అభ్యంకార్ - నిరంజన రామనన్ ఈ మెలోడీ గీతాన్ని ఆలపించారు. ఈ చిత్రానికి 'బాహుబలి' రచయిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ కథ అందించారు.

'తలైవి' చిత్రంలో తమిళనాట రాజకీయాలను జయలలిత ఎలా శాసించగలిగింది? 'అమ్మ' గా ఎలా ఎదిగింది? ఎంజీఆర్ కు ఆమెకు మధ్య ఉన్న ప్రేమ - సాన్నిహిత్యం వంటివి ప్రధానంగా చూపించబోతున్నారు. ఇందులో కరుణానిధిగా సముద్రఖని.. జయలలిత తల్లి సంధ్యగా భాగ్యశ్రీ.. జానకీ రామచంద్రన్ గా మధుబాల కనిపించనున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో విబ్రి మోషన్ పిక్చర్స్ - కర్మ మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై విష్ణువర్థన్ ఇందూరి - శైలేష్ ఆర్. సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Full View
Tags:    
  • Kangana Ranaut 
  • Nee Kannullo Emunnado 
  • Thalaivi 
  • Bollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS