• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డ్ర‌గ్స్ కేసు: దీపికా...

డ్ర‌గ్స్ కేసు: దీపికా పదుకునే మేనేజ‌ర్ కోసం NCB వేట‌..!

By - Tupaki Desk
Update: 2020-11-02 16:00 GMT
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణం అనంత‌రం ఊహాతీత‌మైన మ‌లుపుల గురించి తెలిసిన‌దే. మర్డర్ మిస్టరీగా ప్రారంభమైన ఈ కేసులో ఎన్నో సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ప్ర‌ముఖ క‌థానాయిక‌ల పేర్లు ఇందులో వినిపించ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసుని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. బాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ అన్ ‌ట్రేసిబుల్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. డ్రగ్స్ కేసులో సమన్లు జారీ చేసినా దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ స్పందించకపోవడంతో ఆమె కోసం ఎన్సీబీ వెతుకుతోందని జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొనడం సంచ‌ల‌నంగా మారింది.

ఇప్ప‌టికే బాలీవుడ్ డ్రగ్ వ్యవహారం పై దర్యాప్తు జరిపిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. క్వాన్ టాలెంట్ ఏజెన్సీ మేనేజర్స్ ని విచారించింది. ఇటీవల దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ ఇంట్లో జరిపిన సోదాల్లో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న తర్వాత ఎన్.సి.బి అంకు స‌మ‌న్లు జారీ చేసింది. అయితే కరిష్మా ప్రకాష్‌ విచారణకు గైర్హాజరు కావడంతో ఆమె పరారీలో ఉన్నట్లు అధికారుల గుర్తించారు. దీంతో ఎన్‌సీబీ తాజాగా ఆమెకు మరోసారి సమన్లు జారీ చేసి.. ఆ నోటీసులను ఆమె తల్లి మితాక్షర పురోహిత్‌ కు అందచేశారని తెలుస్తోంది. 'కరిష్మా ఇంటిలో సోదాలు నిర్వహించగా ఆమె ఇంట్లో 1.8 గ్రాముల చరాస్‌ తో పాటు మూడు సీసాల సీబీడీ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నాం. దీనిపై కరిష్మాను మరోసారి విచారించేందుకు సమన్లు జారీ చేశాం. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో తాజాగా మరోసారి సమన్లు జారీ చేశామ'ని ఎన్సీబీ అధికారి వెల్లడించినట్లు నేషనల్ మీడియా తెలిపింది. అయితే కరిష్మా ప్రకాష్ ఎన్‌.డిపిఎస్ కోర్టుకు ముందస్తు బెయిల్ దరఖాస్తును దాఖలు చేశారనే మరో కథనం కూడా వస్తోంది.

కాగా, ఇంతకముందు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజ‌ర్ గా ఉన్న మరో KWAN ఉద్యోగి జయ సాహాను ఎన్సీబీ అధికారులు విచారించారు. అలానే సుశాంత్ కేసులో ప్రధాన నిందితురాలైన‌ రియా చక్రవర్తి డ్ర‌గ్స్ కేసులో అరెస్టు అయ్యారు. అలాగే ఆమె సోదరుడు షోయిక్ తో పాటు పలువురు సుశాంత్ వ్యక్తిగత సిబ్బంది కూడా అరెస్ట‌య్యారు. అయితే రియా ఇటీవలే బెయిల్ ‌పై విడుదల కాగా.. షోయిక్ మాత్రం ఇంకా జైలులో ఉన్నాడు. ఈ కేసులో దీపికా పదుకొనె - శ్రద్ధా కపూర్‌ - సారా ఆలీ ఖాన్‌ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ల పేర్లు కూడా వచ్చాయి. వీరిని విచారించిన ఎన్సీబీ ఎలాంటి నేరారోపణలు రుజువు కాకపోవడంతో తిరిగి పంపించింది. అయితే ఇప్పుడు మరోసారి డ్రగ్స్ కేసుపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ ఇంటిపై దాడులు నిర్వహించడం.. ఆమెకు ఇప్పటికే మూడు సార్లు సమన్లు జారీ చేయడం.. కరిష్మా అందుబాటులోకి రాకపోవడం మరిన్ని అనుమానాలను కలిగిస్తోంది.
Tags:    
  • Sushant Case 
  • Rhea Chakraborty 
  • NCB 
  • kwan 
  • Deepika padukone 
  • manager 
  • karishma prakash 
  • NCB Notices 

Similar News

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Copyright @2026

Powered by Blink CMS