• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  NBK 107 వెట‌ర‌న్...

NBK 107 వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ తో లాంచింగ్ డేట్ ఫిక్స్

By - Tupaki Desk
Update: 2020-03-19 04:09 GMT
``నేను సీతయ్య .. ఎవరి మాట వినను``.. త‌న అన్న హరికృష్ణ చెప్పిన ఈ డైలాగ్‌ తమ్ముడు బాలకృష్ణకి బాగా సూట్‌ అవుతుంది. అవును సినిమాల ఎంపిక‌ల‌ విషయంలో బాలకృష్ణ అలానే చేస్తార‌నేది బ‌హిరంగంగా అంద‌రూ చెప్పే మాట‌. ఎవరి మాట వినరు.. తనకు నచ్చిందే చేసుకుంటూ వెళ‌తార‌ని కామెంట్లు వినిపిస్తుంటాయి. ఒక‌సారి క‌మిటైతే ఆయ‌న మాట ఆయ‌నే విన‌ర‌ని చెబుతుంటారు. అందుకే ఆయన్ని వ్యతిరేకించాలని గానీ.. ఆయనకు ఎదురు చెప్పేందుకుగానీ ఎవరూ సాహసించ‌రు. అందుకే ఆయ‌న చుట్టూ సాధ్యమైనంత వరకు భజన బృందాలు చేరి త‌ప్పిట‌గుళ్లు ఆడేస్తుంటాయన్న కామెంట్లు ఉన్నాయి.

ఇదే స‌ద‌రు హీరో కొంపముంచింద‌న్న గ‌తంలో విశ్లేష‌ణ‌లు సాగాయి. ఇలాంటి భ‌జ‌న బృందాల వ‌ల్ల‌ బయట తమ సినిమాల గురించి ఏమనుకుంటారో బాల‌య్య‌కు తెలిసే ఛాన్స్ ఉండదు. మారుతున్నట్రెండ్ కి తగ్గట్టు ఎలాంటి సినిమాలు చేయాలనే ఆలోచన ఈ త‌ర‌హా స్టార్ కి రాదన్న విమ‌ర్శా పోటెత్తుతోంది మ‌రోసారి. అలాంటి పరిస్థితుల నుంచి బాలకృష్ణ బ‌య‌ట‌ప‌డ‌రా అంటూ గుసగుసలు ఆయన కాంపౌండ్ లోనే వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం `సింహా`.. `లెజెండ్‌` వంటి బ్లాక్‌ బస్టర్స్ ని అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. NBK 106 పేరుతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఇటీవలే ఆర్.ఎఫ్.సీలో షూటింగ్ చేశారు. కరోనా ప్ర‌భావం వల్ల నెక్ట్స్ షెడ్యూల్‌ వాయిదా పడింది. ఇందులో అంజలి.. శ్రియా కథానాయికలు నటిస్తున్నారట. మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దీని తర్వాత సినిమా కూడా ఫైనల్‌ అయినట్టు గత కొన్ని రోజులుగా ప్ర‌చార‌మ‌వుతోంది. తనకు `సమరసింహారెడ్డి`.. `నరసింహనాయుడు` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించిన బి.గోపాల్‌ దర్శకత్వం లో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారని ఇదివ‌ర‌కూ తుపాకి వెల్ల‌డించింది. ఈ ఔట్ డేటెడ్‌ దర్శకుడితో సినిమా చేయడంపై ఓ వైపు విమర్శలు వెల్లువెత్తుతుంటే.. అవేమీ తనకు పట్టవని ఏకంగా ముహూర్తం కూడా ఖరారు చేశారట బాలయ్య. జూన్‌ 10న తన పుట్టిన రోజు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వెట‌ర‌న్ ద‌ర్శ‌కుడితో చిత్రాన్నిప్రారంభించేందుకు ప్లాన్‌ చేశారట. ఇది తెలిసిన వాళ్ళంతా ఏంటి బాలయ్య కొత్త సినిమా ముహూర్తం కూడా కుదిరిందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Tags:    
  • NBK 107 Launch date fix with B Gopal 
  • Balakrishna B Gopal film on cards 
  • Balakrishna 
  • B Gopal 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Telugu News 
  • Balayya107 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS