కోలీవుడ్ ని కేకలు పెట్టించేస్తోంది

Update: 2015-10-29 17:30 GMT
కెరీర్ లో ఒక్కగానొక్క బ్లాక్ బస్టర్ ఉంటేనే.. చాలామంది హీరోయిన్లను పట్టుకోవడం ఎవరితరం కాదు. అలాంటిది ఓ హీరోయిన్ ఏకంగా మూడు నెలల్లో 3 బ్లాక్ బస్టర్లు కొడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కానీ.. చూపించచ్చు. అచ్చు నయనతారలా ఉంటుంది. అదేంటీ అనుకుంటున్నారా..

ఆగస్ట్ 28న తమిళనాట తని ఒరువన్ అనే మూవీ రిలీజైంది. ఇందులో జయం రవి - నయన తారలు జంటగా నటించారు. రికార్డులన్నీ బద్దలు కొట్టేసిన ఈ మూవీని తెలుగులో రామ్ చరణ్  రీమేక్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 17న మాయ అనే తమిళ చిత్రం విడుదలైంది. తెలుగులో మయూరి పేరుతో వచ్చిన ఈ సినిమాకి.. పెట్టుబడికి ఎన్నో రెట్లు లాభాలొచ్చాయి. కేపిటల్ తో కంపేర్ చేస్తే.. ఇది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అనాలి. ఇందులో నయనతారే ప్రధాన పాత్రలో నటించింది. ఈ తర్వాత నానుం రౌడీ దాన్ అనే కోలీవుడ్ మూవీ రిలీజ్ అయింది. విజయ్ సేతుపతి - నయన్ జంటగా నటించారు ఈ మూవీలో. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇలా ఒక హీరోయిన్ 3 నెలల్లో 3  బ్లాక్ బస్టర్లు కొట్టడాన్ని అరుదైన రికార్డ్ గా చెప్పుకోవాలి. ఈ మూడు సినిమాలు ఇంకా థియేటర్లలో సందడి చేస్తుండడం అసలు హైలైట్ గా చెప్పుకోవాలి. ఈ మూవీస్ ని విమర్శకులు తేల్చిపారేస్తే... అన్నిటితోనూ హిట్ సాధించడం విశేషం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.. కోలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ నయనతార అంటున్నారు తమిళనాట జనాలు.
Tags:    

Similar News