• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఫీషియల్: నయనతార ఓపెన్...

అఫీషియల్: నయనతార ఓపెన్ అయ్యింది

By - Tupaki Desk
Update: 2019-03-25 11:12 GMT
గత రెండు రోజులుగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న రాధారవి వివాదం గురించి నయనతార ఓపెన్ అయ్యింది. రెండు రోజుల క్రితం తాను అటెండ్ కాని ఓ సినిమా ఫంక్షన్లో అసభ్యకర రీతిలో కామెంట్స్ చేసిన రాధారవి మీద ఇప్పటికే చాలా మంది ఆర్టిస్టులు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. డిఏంకే పార్టీ ఏకంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి నయన్ కాబోయే భర్త విజ్ఞేశ్ శివన్ స్పందించినప్పటికీ తను మాత్రం సైలెంట్ గా ఉంది. ఇందాక ప్రెస్ నోట్ రూపంలో స్పందించింది. దాని పూర్తి పాఠం ఇదే

"నేను సాధారణంగా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవ్వను. నేను కాదు నా వృత్తి మాట్లాడాలి అనేదే నా స్వభావం. కాని కొన్ని అనివార్య పరిస్థితులు ఇలాంటివాటికి దారి తీస్తాయి. పురుషాధిపత్యం రాజ్యమేలుతున్న దుర్భర స్థితిలో నేను వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ముందుగా ఇది తెలిసిన వెంటనే రాధారవి మీద చర్యలకు పూనుకున్న డిఏంకే ప్రెసిడెంట్ స్టాలిన్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

రాధారవి లాంటి వాళ్ళు తమ జన్మ తల్లి అనే ఆడది నుంచే జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి మగాళ్ళ మధ్య భయంతో మనుగడ సాగిస్తున్న మహిళల పట్ల నాకు సానుభూతి కలుగుతోంది. రాధారవి లాంటి వాళ్ళు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాల్సింది పోయి ఇలా దిగజారడం విషాదం. ఇలాంటి చీప్ పాపులారిటీ కోసం పాకులాడే రాధారవి లాంటి వాళ్ళతో సమాజానికి చాలా ప్రమాదం పొంచి ఉంది.

హేయమైన విషయం ఏంటంటే ఇలాంటి మగాళ్ళు మాట్లాడే తప్పుడు ప్రేలాపనలకు ప్రశంశలు చప్పట్లు అందించే కొందరు మన చుట్టే ఉండటం. ఇలా జరుగుతున్నంత కాలం రాధారవి లాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. ఇలాంటి వాళ్ళకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సందర్భంగా నా మీద మహిళా లోకం మీద రాధారవి అన్న మాటలను ఈ రూపంలో తీవ్రంగా ఖండిస్తున్నాను.

దేవుడు నాకు తమిళ ప్రేక్షకుల రూపంలో గొప్ప జీవితాన్ని అందుకునేలా చేసాడు. మంచి అవకాశాలు వచ్చేలా దీవించాడు. ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా నేను సీతగా దెయ్యంగా దేవతగా స్నేహితురాలిగా భార్యగా ప్రేయసిగా నటిస్తూనే ఉంటాను. నా అభిమానులు అందించే వినోదానికి లోటు లేకుండా చూసుకుంటూనే ఉంటాను

చివరిగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (నడిగర్ సంఘం)నేను అడగాలనుకున్న ప్రశ్న ఒక్కటే. ఇప్పటికైనా అంతర్గత ఫిర్యాదు విచారణ కమిటీని పునరుద్ధరిస్తారా. సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలను గౌరవిస్తూ విశాఖ గైడ్ లైన్స్ మేరకు చర్యలు చేపట్టే విధంగా ఇలాంటి సంఘటలకు విచారణ చేస్తారా ?

మరొక్కసారి ఈ నాకు అండగా నిలిచి ఈ విపత్కాల సమయంలో మద్దతు తెలిపిన మంచి మనసున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇక పనికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది
దేవుడి దయతో మీ అందరి ఎనలేని ప్రేమాభిమానాలతో

నయనతార"
Tags:    
  • Radha Ravi 
  • Nayanthara 
  • Telugu News 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS