శింబును క్షమించింది కానీ.. ప్రభుదేవాను మాత్రం
ఓసారి బ్రేకప్ అయ్యాక మళ్లీ ఆ వ్యక్తితో కలవడం చాలా కష్టం. ఈ విషయంలో సినిమా వాళ్లు కూడా మినహాయింపు కాదు. బాలీవుడ్ దగ్గర్నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు ఇందుకు చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. ఐతే ప్రొఫెషనలిజం అనే పదానికి సౌత్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచే నయనతార మాత్రం శింబుతో ఒకప్పటి గొడవనంతా మరిచిపోయి మళ్లీ అతడితో జతకట్టింది. అప్పట్లో నయన్‌తో తాను రొమాన్స్ చేస్తున్న ఫొటోల్ని బయటపెట్టి శింబు ఎంత రచ్చ చేశాడో అందరికీ తెలిసిందే. శింబు విషయంలో నయన్ చాలా హర్టయిందని వార్తలొచ్చాయి కానీ.. ఇప్పుడవన్నీ మరిచిపోయి అతడితో ఇదు నమ్మ ఆళు అనే సినిమా చేసింది నయన్.
ఐతే శింబు విషయంలో ఇంత ఉదారంగా ఉన్న నయనతార.. ప్రభుదేవా విషయంలో మాత్రం అస్సలు తగ్గట్లేదని కోలీవుడ్ సమాచారం. శింబును క్షమించేసి అతడిత సినిమా చేసిన నయన్.. ఆమె రెండో మాజీ ప్రియుడు ప్రభుదేవాతో నటించడానికి కూడా పెద్దగా అభ్యంతరాలేమీ చెప్పదని భావించి.. ఓ నిర్మాత తనను సంప్రదించాడట. ఇద్దరూ జంటగా సినిమా చేస్తే బాగుంటుందని ప్రపోజల్ పెట్టాడట. కానీ నయన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుదేవాతో మళ్లీ కలిసి నటించేది లేదని తెగేసి చెప్పిందట. మళ్లీ ఇలాంటి ప్రపోజల్‌తో తన దగ్గరికి రావొద్దని హెచ్చరించి పంపిందట. మరి శింబు విషయంలో చూపించిన ప్రొఫెషనలిజాన్ని ప్రభుదేవా విషయంలో ఎందుకు చూపించట్లేదో అర్థం కావట్లేదు. దీన్ని బట్టే ప్రభు నయన్‌ను ఎంతగా హర్ట్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.