హిడెన్ ట్యాలెంట్ తో మ‌తి పోగొడుతోన్న న‌టి!

ఆదా శర్మ కేవలం పక్షుల కూతలే కాదు. మార్షల్ ఆర్ట్స్ (మల్లఖంబ్, కలరిపయట్టు) లో కూడా ఆరితేరింది. ఆమెలోని ఈ బహుముఖ ప్రజ్ఞే ఆమెను ఇతర హీరోయిన్ల కంటే భిన్నంగా నిలబెడుతోంది.;

Update: 2026-03-27 08:30 GMT

ట్యాలెంటెడ్ బ్యూటీ కం నటి ఆదా శర్మ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు న‌టిగా సెకెండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. వైవిథ్య‌మైన క‌థ‌, పాత్ర‌ల్ని ఎంచుకుంటూ త‌న‌కంటూ స‌ప‌రేట్ ట్రాక్ ఏర్పాటు చేసుకుంది. అంతేనా తన విలక్షణమైన వ్యక్తిత్వంతోనూ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటుంది. ఆమెలో ఓ అద్భుతమైన హిడెన్ టాలెంట్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. రకరకాల పక్షుల కూతలను అచ్చుగుద్దినట్లుగా అనుకరించడంలో ఆదా శర్మ సిద్ధహస్తురాలు. సాధారణంగా నటీమణులు తమ గ్లామర్ లేదా డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంటారు.

కానీ ఆదా శర్మ మాత్రం ప్రకృతికి దగ్గరగా ఉంటూ తనలోని ఈ వింత ప్రతిభను తరచుగా ప్రదర్శిస్తుంది. అమ్మ‌డు అడవుల్లోకి లేదా తోటల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పిచ్చుకలు, కాకులు ఇతర అడవి పక్షుల శబ్దాలను అత్యంత సహజంగా అనుకరిస్తుంది. ఆమె గొంతు నుండి వచ్చే ఆ శబ్దాలు వింటుంటే? అది మనిషి చేస్తున్నదా లేక నిజంగానే పక్షి కూస్తోందా అనే సందేహం కలగక మానదు. ఈ మిమిక్రీ టాలెంట్ వెనుక ఆమెకు ప్రకృతిపై ఉన్న మక్కువ స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ `చిన్నప్పటి నుండి పక్షుల శబ్దాలను గమనించడం, వాటిని అనుకరించడం తనకు ఇష్టమని తెలిపింది. కేవలం సరదా కోసం చేసే ఈ పని ఇప్పుడు ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆమె షేర్ చేసే ఇలాంటి వీడియోలు నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి . నెటిజన్లను ఆ వీడియోలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

ఆదా శర్మ కేవలం పక్షుల కూతలే కాదు. మార్షల్ ఆర్ట్స్ (మల్లఖంబ్, కలరిపయట్టు) లో కూడా ఆరితేరింది. ఆమెలోని ఈ బహుముఖ ప్రజ్ఞే ఆమెను ఇతర హీరోయిన్ల కంటే భిన్నంగా నిలబెడుతోంది. `ది కేరళ స్టోరీ` వంటి చిత్రాలతో తన నటనలోని స‌త్తా చాటింది. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇంతటి సరదా మనిషి కావడం విశేషం. ఆమె ప్రతిభను చూసి నెటిజన్లు బహుశా ఆమెకు పక్షుల భాష కూడా అర్థమవుతుందేమో అని స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి వెండితెరపై గ్లామర్ ఒలకబోయడమే కాదు ఇలాంటి అరుదైన కళలతో ప్రేక్షకులను అలరించడం ఆదా శర్మకే చెల్లింది. ప్రకృతిని ప్రేమిస్తూ, మూగ జీవాల పట్ల సానుభూతి చూపిస్తూ ఆమె చేసే ఇలాంటి పనులు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయి. ఆమెలోని ఈ బర్డ్ మిమిక్రీ టాలెంట్ భవిష్యత్తులో ఏదైనా సినిమాలో ఆమె పాత్రకు ఉపయోగపడితే చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రి ఈ హిడెన్ ట్యాలెంట్ ను ముందుగా ఏ ద‌ర్శ‌కుడు వినియోగించుకుంటాడో చూడాలి.


Full View
Tags:    

Similar News