ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే అందులో ఏం ఉండాలి..?

ఒక మూవీ సక్సెస్ అయితేనే ఆ ప్రొడ్యూసర్ కి లాభాలు వస్తాయి. అతను మరో సినిమా చేయడానికి ఆస్కారం ఉంటుంది.

Update: 2026-09-21 10:30 GMT

ఒక మూవీ సక్సెస్ అయితేనే ఆ ప్రొడ్యూసర్ కి లాభాలు వస్తాయి. అతను మరో సినిమా చేయడానికి ఆస్కారం ఉంటుంది. నిజానికి ఒక ప్రొడ్యూసర్ కథ ను సెలెక్ట్ చేసేటప్పుడు ఆ స్టోరీ సక్సెస్ సాధిస్తుందా? లేదా అనేది ఆయనకి ఎలా అర్థం అవుతుంది. అయిన ఒక మూవీ సక్సెస్ అవ్వాలంటే అందులో మెయిన్ గా ఏం ఉండాలి అనే ప్రశ్న చాలామందికి వస్తుంది. ఒక సక్సెస్ ఫుల్ కథలో ఎమోషన్ ఉండాలి. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దానికి సంబంధించిన వరల్డ్ మొత్తాన్ని ప్రాపర్ గా సెట్ చేయాలి. క్యారెక్టర్స్ మధ్య కనెక్టివిటీ ఉండాలి. సీన్ కి సీన్ కి ఫ్లో ఉండాలి. స్క్రీన్ మీద కనిపించే ప్రతి క్యారెక్టర్ కి కథ లో ఇన్వాల్వ్ మెంట్ ఉండాలి. స్క్రీన్ ప్లే చాలా టైట్ గా ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే కథ ప్రకారం సినిమా 60% సక్సెస్ ను సాధిస్తుంది. ఇక మిగతాది డైరెక్టర్ ఆ కథను స్క్రీన్ మీద ఏ రేంజ్ లో ప్రజెంట్ చేస్తాడనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో డైరెక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడనే దాని మీదనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమాల హవా కొనసాగుతుంది. ఇలాంటి సందర్భంలో దర్శకులందరు ఒకటికి రెండుసార్లు తమ కథలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఎవరికి వాళ్లు చర్చించుకుంటే మంచిది. అలా చేస్తే వాళ్ళకే కథ మీద ఒక క్లారిటి దొరుకుతుంది. అలా కాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏం చేయకుండా స్టోరీ లో చాలావరకు మైనస్ లు ఉన్నప్పటికి స్క్రిప్ట్ దశలో వాటిని లైట్ తీసుకుంటే మాత్రం సినిమా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా కూడా ఒక మంచి కథ ఉన్నప్పుడే అది మంచి సినిమాగా రూపొందుతుందనేది వాస్తవం. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు కథల పట్ల క్లారిటిగా ఉంటే చాలా వరకు ప్లాపులు తగ్గుతాయి.

ఒకప్పుడు కథ రచయితలు సపరేట్ గా ఉండేవారు. వాళ్ళు కథలను అందిస్తే దర్శకులు సినిమాలను చేసేవారు. కానీ ఇప్పుడు దర్శకులే రచయితలుగా మారిపోవడం వల్ల కొంతవరకు కొన్ని కథలను దర్శకులు జడ్జ్ చేయలేకపోతున్నారు. దానివల్ల ప్రేక్షకుడు ఎలాంటి కథలను ఇష్టపడతాడో తెలుసుకోవడంలో డైరెక్టర్లు క్లారిటి మిస్ అవుతున్నారు. ఇక దానికి తోడుగా కథలో కాన్ఫ్లిక్ట్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేయడంలో దర్శకులు ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి కథ రచయితలు ఉంటేనే సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందని చెప్పే వారు కూడా ఉన్నారు...

Tags:    

Similar News