రామాయణం.. అసలైన అప్డేట్ ఎప్పుడంటే?
నిర్మాత నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెడుతూ, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆ మూమెంట్ ను రివీల్ చేశారు.;
భారతీయ సంస్కృతిలో రామాయణం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తరతరాలుగా జీవితాల్లో భాగమైన ఈ గొప్ప కథను ఇప్పుడు వెండితెరపై చాలా భారీగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ దగ్గరి నుండి దేశవ్యాప్తంగా అంచనాలు పెంచేసింది. ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ ప్రాజెక్టును మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న లీక్స్, నటీనటుల వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండటం సినిమాపై ఆసక్తిని పెంచింది. అలాగే రావణుడిగా రాకింగ్ స్టార్ యష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ వంటి వారు ఉండటంతో అందరిలోనూ క్యూరియాసిటీ మొదలైంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇంటర్నేషనల్ టెక్నాలజీ వాడుతుండటంతో, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా నిలుస్తుందని అంతా భావిస్తున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. నిర్మాత నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెడుతూ, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆ మూమెంట్ ను రివీల్ చేశారు. ఏప్రిల్ 2వ తేదీన, హనుమాన్ జయంతి రోజున ‘రామ’ గ్లింప్స్‌ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అభిమానుల సమక్షంలో ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా ఈ గ్లింప్స్‌ను లాంచ్ చేయబోతున్నారు.
ఈ అప్‌డేట్ రావడంతో ఒక్కసారిగా నెట్టింట హంగామా మొదలైంది. ఏళ్ల తరబడి పడుతున్న కష్టాన్ని ఈ గ్లింప్స్ ద్వారా ప్రపంచానికి చూపించబోతున్నామని నమిత్ మల్హోత్రా చెప్పారు. కేవలం ఒక అనౌన్స్ మెంట్ లా కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు, సినిమా ప్రేమికులు గర్వపడేలా ఈ వేడుకను ప్లాన్ చేస్తున్నారట. హనుమాన్ జయంతి రోజున రాముడి అప్‌డేట్ ఇవ్వడం వెనుక ఒక సెంటిమెంట్ కూడా కనిపిస్తోంది.
మరోవైపు ఎనిమిది సార్లు ఆస్కార్ గెలుచుకున్న ‘DNEG’ సంస్థ ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను తీసుకుంది. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యష్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ఐమాక్స లో రిలీజ్ కానుంది. రామాయణాన్ని ఇంత పెద్ద స్కేల్‌లో చూడటం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.
శ్రీరామనవమి వేళ వచ్చిన ఈ అప్డేట్ తో ‘రామాయణం’ టీమ్ గట్టిగానే సౌండ్ చేసింది. ఏప్రిల్ 2న రాబోయే ఆ గ్లింప్స్ ఎలా ఉండబోతోంది? రణబీర్ కపూర్ రాముడి గెటప్‌లో ఎలా మెరిసిపోనున్నారు? అనే విషయాలపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.