ఎట్ట‌కేల‌కు జై హ‌నుమాన్ ప‌ట్టాలెక్కిందా?

జై హనుమాన్ కేవలం ఒక సూపర్ హీరో సినిమా మాత్రమే కాదు. ఇది భారతీయ పురాణాలకు ఆధునిక టెక్నాలజీని జోడించి తీస్తున్న ఒక విజువల్ వండర్.;

Update: 2026-03-27 08:24 GMT

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రాజెక్ట్ జై హనుమాన్ ఎట్టకేలకు పట్టాలెక్కిన‌ట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ తాజాగాదరాబాద్‌లో గ్రాండ్‌గా షూటింగ్‌ను ప్రారంభించిర‌న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. `హనుమాన్ పాన్ ఇండియాలో సాధించిన విజయం తర్వాత, దానికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రంపై అంచ‌నాలైతే భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఒక భారీ ప్రత్యేకమైన సెట్‌ను రూపొందించారు.

పురాతన అంజనాద్రి సామ్రాజ్యాన్ని తలపించేలా? అత్యంత ఖరీదైన కళాఖండాలతో ఈ సెట్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రశాంత్ వర్మ విజన్ ప్రకారం విజువల్స్ పరంగా ఈ సినిమా హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని టీమ్ రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. సినిమాలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. కాంతార సినిమాతో తన నటనలోని విశ్వరూపాన్ని చూపించిన రిషబ్ ఇప్పుడు హనుమంతుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తున్నారు.

షూటింగ్ ప్రారంభమైన తొలిరోజే రిషబ్‌తో పాటు మరి కొంతమంది కీలక నటీనటులు సెట్స్‌లో సందడి చేశారు. రిషబ్ శెట్టి ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారని, ఆయన బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. ఈ షూటింగ్ షెడ్యూల్‌లో కేవలం రిషబ్ మాత్రమే కాకుండా, కథలో కీలక మలుపులు తిప్పే ఇతర ముఖ్య నటులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే రానా దగ్గుబాటి ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త‌లొస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ అందులో క్లారిటీ లేదు. అయితే షూటింగ్ స్పాట్‌లో కొందరు సీనియర్ నటులు కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది.

జై హనుమాన్ కేవలం ఒక సూపర్ హీరో సినిమా మాత్రమే కాదు. ఇది భారతీయ పురాణాలకు ఆధునిక టెక్నాలజీని జోడించి తీస్తున్న ఒక విజువల్ వండర్. మొదటి భాగంలో హనుమంతుడి దర్శనం కేవలం కొద్దిసేపే ఉన్నప్పటికీ ఈ సినిమాలో హనుమంతుడే ప్రధాన పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే పోస్టర్స్ ద్వారా స్పష్టమైంది. అందుకే యాక్షన్ సన్నివేశాల కోసం అంతర్జాతీయ స్టంట్ మాస్టర్లను రంగం లోకి దించారు. మ‌రి సినిమా రిలీజ్ ఎప్పుడంటే? అందుకు చాలా స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. ఏడాది పాటు షూటింగ్ జ‌రుగుతుంద‌నేది స‌మాచారం. దీంతో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల‌కు కూడా స‌మయం ఎక్కువ‌గానే ప‌డుతుంది. ఏలా లేద‌న్నా రిలీజ్ కు ఏడాదిన్న‌ర నుంచి రెండేళ్లు ప‌ట్టే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News