ఆ డీఐజీ రోల్ దేవసేనకేనా?
కన్నడ ఫిలిం మేకర్ ఏఎంఆర్ రమేష్ కు.. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సెన్సిటివ్ అంశాలను సినిమాలుగా మలచడంలో ఈయన చూపించే ప్రతిభకు అందరూ ముగ్ధులవుతారు. రాజీవ్ గాంధీ హత్యోదంతం.. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి వంటి అంశాలపై ఈయన రూపొందించిన రియల్ లైఫ్ మూవీస్ బాగా ఆకట్టుకున్నాయి.
ఇప్పుడీ రమేష్ మరో కొత్త టాపిక్ పై మూవీ చేయబోతున్నాడు. శశికళకు పరప్పణ అగ్రహారం జైల్ లో సకల సౌకర్యాలు అందుతున్న అంశాన్ని ఓ రిపోర్ట్ ద్వారా బైటకు వెల్లడించిన డీఐజీ డి. రూప.. బయోపిక్ ను రూపొందించనున్నాడు రమేష్. ఇప్పటికీ ఈమె ఇదే జైల్ లో ఉన్నా.. రూప వెల్లడించిన నివేదిక ఓ సంచలనం. గతంలో కూడా స్టాంప్ కుంభకోణంలో అబ్దుల్ కరీం తెల్గి విషయంలో కూడా ఇలాగే వెల్లడించినా.. శశికళ విషయంలోనే ఈమె బాగా ఫోకస్ అయ్యారు. ప్రస్తుతం ఈమె ట్రాఫిక్.. రోడ్ సేఫ్ట్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తుండగా.. తన బయోపిక్ ను చిత్రీకరించేందుకు ఇప్పటికే అనుమతి కూడా ఇచ్చేశారీమె.
ప్రస్తుతం అన్ని ఆధారాలను సేకరిస్తున్నానని చెప్పిన దర్శకుడు రమేష్.. స్క్రిప్ట్ రైటింగ్ కంటే ముందే అన్ని అంశాలను తెలుసుకుంటానని చెబుతున్నాడు. రూప జీవితంలో చిన్ననాటి సంగతుల నుంచి.. ఆమెను ఐపీఎస్ కు ఇన్ స్పైర్ చేసిన సంఘటనల వరకూ ఈ సినిమాలో చూపించబోతున్నారట. అయితే.. ఈ సెన్సేషనల్ ఆఫీసర్ పాత్రకు ఎవరిని తీసుకుంటారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు కానీ.. దేవసేనగా విపరీతమైన గుర్తింపు సంపాదించిన అనుష్క శెట్టి.. సౌత్ బ్యూటీ నయనతారల్లో ఒకరిని ఈ రోల్ కు తీసుకునే యోచన ఉందని దర్శకుడు అంటున్నాడు. అయితే.. ముందు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాకే క్యాస్టింగ్ పనులు మొదలుపెడతాడట.