ఛీ ఛీ.. నయనతార పరువు తీస్తున్నారు

Update: 2015-07-06 10:55 GMT
చేతిలో ఫోటోషాప్‌ ఉంటే ఇక ఎలాంటి చెత్త వేషాలైనా వేసేయవచ్చు అని ఫిక్సయిపోతున్నారు కొందరు దుండగులు. అసలు ఫోటోలను మార్ఫింగ్‌ చేసి రచ్చరచ్చ చేయడం అనేది ఈ ఫోటోషాప్‌ వాడకం పెరిగాక ఇంకా ఎక్కువైపోయింది. పెద్ద పెద్ద కళాదర్శకులు, డిజైనర్లు ఫోటోషాప్‌ను తమ క్రియేటివిటీని ప్రపంచానికి చూపించడానికి వాడుతుంటే.. కొందరు వెధవలు మాత్రం అదే సాఫ్ట్‌వేర్‌తో నయనతార వంటి సెక్సీ లేడీస్‌ పరువు తీస్తున్నారు.

ఇదిగో ఒకడు చూడండి.. ఎక్కడో ఓ చోట ఓ ఫారినర్‌ ఒక కోతి పిల్లను టీజ్‌ చేస్తుంటే.. సదరు కోతిపిల్ల ఆమె క్యామిజోల్‌ టీషర్టును చేత్తో లాగేసింది. దానితో అనవసరమైన అంగ ప్రదర్శన చోటుచేసుకుంది. ఇక ఈ ఫోటోను తీసుకొని, దానికి నయనతార ముఖాన్ని తగిలించి.. మనోళ్ళు 'షాకింగ్‌' 'రాకింగ్‌' 'అయ్యో పాపం' అంటూ వాట్సాప్‌లో దీన్ని షేర్‌ చేస్తూ, ఫేస్‌బుక్‌లో దీని గురించి చెప్పుకుంటూ ఆమె పరువును బజారుకు ఈడ్చుతున్నారు. ఇది నిజమైన ఫోటోయేనా అని అనుమానం వచ్చి కాస్త డీప్‌గా వెతికితే.. అసలు విషయం భయటపడింది. ఇలా నయనతారను ఫోటో షాప్‌ ద్వారా ఆ ఫోటోలోకి తీసుకొచ్చి అనవసరమైన రచ్చ చేస్తున్నారనమాట. సైబర్‌ నేరాల్లో మరి ఇలాంటి మార్ఫింగ్‌ను కూడా ఒక నేరంగా పరిగణిస్తూ చట్టం వీరిపై చర్యలు తీసుకుంటే బెటర్‌.

Tags:    

Similar News