సిస‌లైన 'నాయ‌కి' మ‌రోసారీ..

Update: 2018-08-18 17:30 GMT

సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్‌ ని త‌లైవా అని అభిమానులు పిలుస్తారు. ఆ త‌ర్వాత క‌థానాయిక‌ల్లో `త‌లైవి`గా పేరు తెచ్చుకున్న ఏకైక తార న‌య‌న‌తార‌. న‌య‌న్ న‌టిస్తే చాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల హ‌వా సాగుతుంది అక్క‌డ‌. ఇటీవ‌ల వ‌రుస‌గా నాయికా ప్రాధాన్య పాత్ర‌ల్లో న‌టిస్తూ ఈ స్టింట్‌ని మ‌రింత పెద్ద స్థాయికి తీసుకెళ్లింది. హీరోలతో ప‌నేలేకుండా న‌య‌న‌తార బ్రాండ్ చూసి జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు.

అందుకే న‌య‌న్ న‌టించిన `కోల‌మావు కోకిల‌` సినిమా రిలీజ‌వుతోంది అన‌గానే తంబీల్లో ఒక‌టే ఆసక్తి. ఈ సినిమా టీజ‌ర్ ద‌శ‌నుంచే ఉత్కంఠ పెంచింది. సైలెంటుగా అమాయ‌కురాలిలాగా క‌నిపిస్తూనే న‌య‌న్ సాగించిన సీక్రెట్‌ ఆప‌రేష‌న్ ఏంటి? అన్న‌ది తెర‌పై చూపిస్తున్నార‌న్న‌ది టీజ‌ర్‌ లో చూపించారు. దాంతో ఉత్కంఠ పెరిగింది.

నిన్న‌నే ఈ సినిమా రిలీజై డే 1 వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము దులిపేసింద‌న్న టాక్ వినిపిస్తోంది. ఆ మేర‌కు ప్ర‌ఖ్యాత క్రిటిక్ ర‌మేష్ బాలా ఈ సినిమాకి అద్భుత‌మైన రేటింగ్ ఇచ్చి, తొలిరోజు చ‌క్క‌ని వ‌సూళ్లు ద‌క్కించుకుంద‌ని కితాబిచ్చారు. బాక్సాఫీస్ వ‌ద్ద తొలిరోజు 5కోట్లు అంత‌కుమించి వ‌సూళ్లు సాధించింద‌ని ఇప్ప‌టికే ట్రేడ్‌ లో వినిపిస్తోంది. న‌య‌న్ ఎఫెక్ట్‌ తోనే.. ఈ విజ‌యం సాధ్య‌మైంద‌ని చెబుతున్నారు. త‌మిళ‌నాడులో భారీ ఓపెనింగ్స్ సాధించింది - విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది కాబ‌ట్టి తెలుగు వెర్ష‌న్‌కి క్రేజు నెల‌కొంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే తెలుగు వెర్ష‌న్ టీజ‌ర్‌కి మంచి స్పంద‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News