టికెట్ రేట్ రూ.5..30 కోట్లు క‌లెక్ట్ చేసింది!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు కావాల‌ని కొన్నేళ్లు శ్ర‌మించి `శ్రీ‌` అనే టైటిల్‌తో ప్రేమ‌క‌థ‌ని రాసుకున్నార‌ట‌.;

Update: 2026-03-28 07:30 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు 19 ఏళ్ల‌కే స్టార్‌డ‌మ్‌ని తీసుకొచ్చిన మూవీ `ఆది`. ద‌ర్శ‌కుడిగా వి.వి.వినాయ‌క్‌కు ఇది ఫ‌స్ట్ మూవీ. ఫ్యాక్ష‌న్ క‌థా చిత్రాల‌కు ఆద్యం పోసిన సినిమా ఇదే. టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేసి కంటెంట్ ఉండే కాసుల వ‌ర్షం కురుస్తుంద‌ని నిరూపించి ఎంతో మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు స‌రికొత్త దారిని చూపించింది. ఎన్టీఆర్‌కు మాస్ హీరోగా తిరుగులేని గుర్తింపుని తెచ్చి ప‌ట్టింది. ఈ సినిమా ఇడుద‌లై నేటికి (ఏప్రిల్ 28)కి 24 ఏళ్లు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన తెర వెనుక విశేషాలివి.

ముందు రిజెక్ట్ చేసిన ఎన్టీఆర్‌...

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుల వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడు కావాల‌ని కొన్నేళ్లు శ్ర‌మించి `శ్రీ‌` అనే టైటిల్‌తో ప్రేమ‌క‌థ‌ని రాసుకున్నార‌ట‌. అది ఎన్టీఆర్‌కు వినిపించ‌డం, త‌ను ఓకే చెప్ప‌డం అంతా చ‌క చ‌క జ‌రిగిపోయాయి. ఫైన‌ల్‌గా సినిమా ఓపెనింగ్‌కు టైమ్‌ని కూడా ఫైన‌ల్ చేసేశారు. క‌ట్ చేస్తే స్నేహితుడు చెప్ప‌డంతో ఎన్టీఆర్ `శ్రీ‌` స్టోరీని రిజెక్ట్ చేసి సినిమా ఆపేద్దామ‌న్నార‌ట‌. ఆ మాట విని షాక్‌కు గురైన వినాయ‌క్ ఒక్క అవ‌కాశం ఇవ్వండి. న‌చ్చితేనే ఛాన్స్ ఇవ్వండ‌ని చెప్పాడ‌ట.

దాంతో స‌రే అని ఎన్టీఆర్ టైమ్ ఇవ్వ‌డంతో వినాయ‌క్ రెండే రెండు రోజుల్లో `ఆది` క‌థ‌ని సిద్ధం చేయించి ఫైన‌ల్ డ్రాఫ్ట్‌ని రెడీ చేసిన ఎన్టీఆర్‌కు వినిపించార‌ట‌. ఒక్క‌సారిగా స్పెల్ బౌండ్ అయిన ఎన్టీఆర్ ఈ క‌థ ఓకే వెంట‌నే చేసేద్దామ‌ని చెప్ప‌డంతో `ఆది` ప‌ట్టాలెక్కింది. బాక్సాఫీస్ వ‌ద్ద చ‌రిత్ర సృష్టించింది. ఎన్టీఆర్ కెరీర్‌ని మ‌లుపు తిప్పి మాస్ హీరోగా స్టార్‌డ‌మ్‌ని తెచ్చి పెట్టింది.

రూ.2.5 కోట్ల‌తో తీస్తే...

2002, మార్చి 28న విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించ‌డ‌మే కాకుండా ఫ్యాక్ష‌న్ చిత్రాల‌కు ఆజ్యం పోసిన సినిమాగా నిలిచి సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా మారింది. ఈ మూవీ కోసం ప్రొడ్యూస‌ర్ బెల్లంకొండ సురేష్ పెట్టిన బ‌డ్జెట్ అక్ష‌రాలా రూ.2.5 కోట్లు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్‌, శాటిలైట్ రైట్స్‌, మ్యూజిక్ రైట్స్‌తో క‌లిపి రూ.30 కోట్లు రాబ‌ట్టి అందరిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అంతే కాకుండా 19 ఏళ్ల వ‌యసులో ఎన్టీఆర్ స‌త్తా ఏంటో ఇండ‌స్ట్రీకి తెలిసేలా చేసింది. `ఆది` త‌రువాత ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ల‌కు హాట్ కేక్‌గా మారిపోయాడు. త‌న‌తో సినిమా చేస్తే లాభాలు గ్యారంటీ అనే సంప్ర‌దాయం మొద‌లైంది.

రూ.2.5 కోట్లుతో ఈ మూవీని తీశారు. అప్ప‌ట్లో టికెట్ రేట్ రూ.5 మాత్ర‌మే. హ‌య్యెస్ట్ రేట్ రూ.35 మాత్ర‌మే. ఈ రేంజ్ టికెట్ రేట్ల‌తో `ఆది` బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ క్రియేట్ చేయ‌డ‌మే కాకుండా దాదాపు రూ.30 కోట్ల వ‌ర‌కు రాబ‌ట్టిందంటే ఎన్టీఆర్ స‌త్తా ఏంతో అర్థం చేసుకోవ‌చ్చు. అదే నేటి ప‌రిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే వ‌సూళ్లు ఏ మూడు వందల కోట్ల‌కు పైనే ఉండేవేమో.

రివార్డులు..అవార్డులు...

96 సెంట‌ర్ల‌లో 100 రోజులు ఆడింది. 121 కేంద్రాల్లో 50 రోజులు ప్ర‌ద‌ర్శింప‌బ‌డింది. బెస్ట్ ఫ‌స్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌, బెస్ట్ ఎడిట‌ర్ గౌతంరాజు, బెస్ట్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్‌, స్పెష‌ల్ జ్యూరి అవార్డ్ ఫ‌ర్‌ ఎన్టీఆర్‌ల‌కు ప‌లు విభాగాల్లో నంది పుర‌స్కారాలు ద‌క్కాయి. ఈ ఫ్యాక్ష‌న్ డ్రామాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఇప్ప‌టికీ ఈ మూవీ సాంగ్స్‌, బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

Tags:    

Similar News